బీ ఎన్ రెడ్డి చిత్రాలపై భానుమతి

బీ నాగి రెడ్డి మంచి అభిరుచి గల నిర్మాత. ఆయన ఎక్కడా రాజీ పడే వారు కాదు. ఆయన ఎలాగైతే తీయాలనుకున్నారో అలాగే తీసే వారు. అందుకోసం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సాధించి తీయించేవారు. కనుకనే ఆయన చిత్రాలు భిన్నంగా ఉండేవి, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేవి. బీ ఎన్ రెడ్డి తీసిన స్వర్గసీమ, మల్లీశ్వరి  చిత్రాలలో భానుమతి నటించారు. పాటలు పాడారు. ఈ విషయం అందరికీ తెలిసినవే. ఈ రెండు చిత్రాలు చిరస్మరణీయంగా ఉండిపోవాలన్న ఏకైక కారణంగా బీ ఎన్ రెడ్డి  వాటిలో భానుమతిని నటించేలా ఒప్పించారు. ఆయన కోరిక మేరకు ఈ చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నట్టు భానుమతి చెప్పుకునే వారు. ఆమె మనస్పూర్తిగా నటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె మిగిలిన చిత్రాల షూటింగుల టైములు ఎలా   ఉన్నా వాటిని సర్దుబాటు చేసుకుంటూ ఈ రెండు చిత్రాలకు ప్రాణంపోసి నటించారు అని చెప్పుకునేవారు. అందుకోసమే బీ ఎన్ రెడ్డి గారు తీసే సినిమాలు రెండేళ్ళైనా మూడేళ్ళు అయినా నటించడానికి ఆమె సమ్మతించేవారట.ఒక షాట్ తీస్తే ఒక్కొక్క రోజు ఆ పర్టిక్యులర్ షాట్ మాత్రమే తీసేవారు. అప్పుడు ఆ ఒక్క షాట్ కోసం రోజంతా కూర్చోవలసి వచ్చినా కూర్చునేదానినని భానుమతి చెప్పేవారు. అలా సహకరించే నటులతోనే ఆయన సినిమా తీసేవారు. ముందుగానే తనకు ఏం కావాలో చెప్పి అందుకు ఒప్పుకుంటేనే ఆ నటులతో అగ్రిమెంటు చేసుకునే వారు. ఆయన తనకు నచ్చిన ధోరణిలోనే సినిమా తీసేవారు. చివరి వరకు ఆయన ఈ పంధాలోనే కొనసాగడం ఆయనకే చెల్లింది.

Send a Comment

Your email address will not be published.