బుర్రిపాలాన్ని దత్తత...

నటుడు మహేష్ బాబు గుంటూరు జిల్లాలోని తమ పూర్వీకుల పల్లె అయిన బుర్రిపాలెం ని దత్తత తీసుకున్నారు.

మహేష్ బాబు తండ్రి, అలనాటి హీరో కృష్ణ ఈ బుర్రిపాలెం పల్లె లోనే పుట్టిపెరిగారు. కృష్ణ కుటుంబం ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ పల్లెను సందర్శిస్తూ ఉంటుంది.

అంతదాకా ఎందుకు క్రిషన్ తాను హీరోగా నటించిన ఒక సినిమాకి బుర్రిపాలెం బుల్లోడు అని టైటిల్ కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 1979 లో వచ్చింది.

మహేష్ బాబుకి తన బామ్మ నాగరత్నంతో ఎంతో అనుబంధముంది. ఆమె తుది శ్వాస విడిచే వరకు ఇక్కడే ఉన్నారు.

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఈ దత్తత విషయమై విడమరచి చెప్పలేనని, ఈ విషయమై అన్ని కోణాల నుంచి పరిశీలించి తాము అనుకున్న ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.