బెంగాల్ టైగర్ మాస్ మసాలా

రవితేజ, తమన్నా, రాశి ఖన్నా, బ్రహ్మానందం, పృధ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన బెంగాల్ టైగర్ చిత్రం ఫక్తు మాస్ మసాల అని వేరేగా చెప్పక్కర లేదు. కె కె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు సంపత్ నంది. రచన కూడా సంపత్ నందీయే. బీమ్స్‌ సిసిరాలియో సంగీతం స్వరపరిచారు. చిత్రీకరణ వల్ల పాటలు ఆకట్టుకుంటాయి.

మాస్‌ మసాలాకు ఏ మాత్రం తగ్గకుండా సంపత్‌ నంది స్క్రిప్ట్ తయారు చేసుకుని రంగంలో దిగారు. తన కథకు రవితేజ అచ్చంగా సరిపోతారని అనుకున్నారు. రవితేజ రెచ్చిపోవాలంటే ఇద్దరు గ్లామర్ తారలు ఉంటే బాగుంటుందని భావించిన దర్శకులు కాలక్షేపం చిత్రంగా రూపొందించారు.

ఆకాష్‌ పాత్రలో రవితేజ నటిం చారు. అతను ఉన్నట్టుండి పైకెదిగిపోవాలని అనుకుని ఒక మంత్రిని అందరూ ఉన్న సభలో కొడతాడు. అతని దగ్గరే పనిలోకి చేరుతాడు. అనంతరం మరో పెద్ద మంత్రి ఇంట్లో పని చేసే అవకాశం లభిస్తుంది. దానితో ఈ మంత్రిని నడిరోడ్డులో విడిచిపెట్టి పోతాడు. హోంమంత్రి కూతుర్ని ప్రేమలో పడేస్తాడు. ఆమె తండ్రే తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. అయితే ఆకాష్ తాను సీఎం కూతురినని ప్రేమిస్తున్నానని చెప్తాడు. హోమంత్రి కంగుతింటాడు. కానీ ఇదంతా చేయడంలో ఆకాష్ వెనుక ఓ బలమైన కారణం ఉంది. అది తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాలి.

చూస్తున్నంతసేపు వినోదానికి ఏ మాత్రం డోకా లేదు. అసలు రవితేజ అంటేనే వినోదానికి పెట్టింది పేరు అని వేరేగా చెప్పక్కరలేదు. పృధ్వీ, పోసాని కలిసి ఫస్ట్ హాఫ్ లో చేసిన కామెడీ బాగా పండింది.
సెకండ్ హాఫ్ లో రవితేజ, బోమన్‌ ఇరానీ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి.

గ్లామర్ తారలు తమన్నా, రాశి ఖన్నా నువ్వా నేనా అన్నట్టు పోటీపడి నటించారు.

రొటీన్ కి భిన్నమైన మాస్ మసాలా చిత్రం బెంగాల్ టైగర్ అనడంలో సందేహం లేదు.

Send a Comment

Your email address will not be published.