బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం

ప్రముఖ నటి తాప్సీకి బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం.

తన పద్దెనిమిదో ఏట బైక్ నడపటం నేర్చుకున్నానని, దాదాపుగా అన్ని రకాల బైక్లను నడిపానని తాప్సీ చెప్పారు. హోండా బైక్ తో పాటు అంబాసిడర్ ఉండటం వల్ల తరచూ ఇరుగుపొరుగు ప్రాంతాలకు వెళ్తూనే ఉంటానని చెప్పారు.

మిస్టర్ పెర్ఫెక్ట్ అనే చిత్రంలో తాను బైక్ నడుపుతున్న సన్నివేశం ఉందని, ఆ సన్నివేశం మహా ఆనందంగా చేసానని తాప్సీ చెప్పారు. బైక్ నడపటం తన హాబీ తప్పించి మోటార్ సైకిల్ రేసులలో పాల్గొనే ఆలోచన ఏ మాత్రం లేదని తెలిపారు.

తాప్సీ తన ఈవెంట్ సంస్థ అయిన వెడ్డింగ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఈ సంస్థను తాను ఫ్రెండ్ ఫరా పర్వరేష్, తన చెల్లెలు షాగున్ లతో కలిసి ప్రారంభించినట్టు చెప్పారు. పెళ్లిళ్లకు సంబంధించి సకలం ఈ సంస్థ ద్వారా సమకూర్చడం తమ వంతని అన్నారు.
ఇక మీదట ఎవరైనా తనను కలిసి పెళ్లి ఎప్పుడు అని అడిగితే వచ్చే నెల ఒకటో తేదీ అనో, ఆ మరుసటి నెల మరో తేదీ చెప్పి అప్పుడు పెళ్ళని చెప్తానని ఆమె నవ్వారు జోక్ గా. తమ ముగ్గురిలో షాగున్ ఎక్కువ టైం కేటాయించి ఈ సంస్థను చూసుకుంటోందని తాప్సీ అన్నారు.

బిగ్ బీ అమితాబ్ గురించి మాట్లాడుతూ ఆయన రాక్ స్టార్ అని, పింక్ అనే చిత్రంలో ఆయనతో కలిసి తీసుకున్న సేల్ఫీ పిక్స్ ని ట్విటర్ లో పోస్ట్ చేసినట్టు ఎంతో ఆనందంగా చెప్పారామె.
అమితాబ్ తో కలిసి నటించిన ప్రతి క్షణం మరవలేనని, డిల్లీలో స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లోనే తాను విపరీతంగా అమితాబ్ ను అభిమానించే దానినని అన్నారు.
తానూ, అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన బేబీ అని చిత్రాన్ని అమితాబ్ చూసారని, తానూ బాగా నటించినట్టు చెప్పడం సంతోషం కలిగించిందని తాప్సీ చెప్పారు. డెబ్బై ఏళ్ళు పై బడినా ఇప్పటికీ అమితాబ్ లోని ఎనర్జీ అమోఘమని అన్నారు.

Send a Comment

Your email address will not be published.