బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

అన్నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ కథనం

అల్లరి నరేష్, కార్తీక  నటించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సిరి సినిమా పతాకంపై బీ చిన్ని దర్శకత్వ్మలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాలో నరేష్ కు సమానమైన క్యారక్టర్ లో కార్తీక నటించారు.

రొటీన్ కి భిన్నమైన పాత్రలో నటించిన అల్లరి నరేష్ ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

అల్లరి నరేష్ కి చెల్లెలు గా నటించారు కార్తీక.  వీరిద్దరూ కవలలుగా పుట్టినా వీరి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయి. నరేష్ చాలా నెమ్మది. పైగా భయంపాలు కూడా ఎక్కువే. మరోవైపు కార్తీక భయం అంటే ఏమిటో తెలియని పాత్రలో నటించారు. ఆమె అంటే అమ్మా నాన్నలకు కూడా భయమే. కథ ఇలా సాగుతుంటే నరేష్ ప్రేమలో పడతాడు. ఆ ప్రేయసిగా మోనాల్ గజ్జార్ నటించారు. వీరు పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఇక్కడ అమ్మానాన్నలు నరేష్ కి ఒక షరతు విధిస్తారు. చెల్లి కార్తీక పెళ్లి అయిన తర్వాతే నరేష్ ని పెళ్లి చేసుకోవాలని కచ్చితంగా చెప్తారు. ఈ క్రమంలో కార్తీకకు సంబంధాలు చూడటం మొదలుపెడతారు. అయితే వచ్చిన సంబంధాలను కార్తీక వద్దని తిరస్కరిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒక రోజు కార్తీక తానూ ప్రేమలో పడ్డానని, హర్షవర్ధన్ రాణేని ప్రేమిస్తున్నట్టు చెప్తారు. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తారు కార్తీక. మరోవైపు హర్షవర్ధన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆ పెళ్లి జరగనివ్వకూడదని, చూసి అతనితో తన పెళ్లి చెయ్యమని నరేష్ తో కార్తీక చెప్తారు. అన్నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో చెప్పే సినిమానే బ్రదర్ ఆఫ్ బొమ్మాళి. అనేక మలుపులతో సాగిన సినిమాను వెండితెరపై చూడవలసిందే. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Send a Comment

Your email address will not be published.