బ్రహ్మాజీ అజాతశత్రువు

brahmajiటాలీవుడ్ లో మృదువుగా మట్లాడే నటులలో బ్రహ్మాజీ ఒకరు. చిత్రపరిశ్రమలో అన్ని వర్గాలవారితోనూ సత్సంబంధాలు కొనసాగించే వ్యక్తి బ్రహ్మాజీ. ఆయన తన నిజజీవితంలోనూ అంతే. నెక్స్ ట్ నువ్వే అనే చిత్రంలో బ్రహ్మాజీ ఆదికి మిత్రుడిగా కనిపిస్తాడు. ఆయనకు ఎవరితోనూ ఎలాంటి వైరమూ లేదు. అందుకే ఆయనను తెలిసిన వారు బ్రహ్మాజీని ఓ అజాతశ్రతువుగా చెప్పుకుంటారు.

ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ తాను తన కెరీర్ లో మొదటిసారిగా హరర్ కామెడీ చిత్రం (నెక్స్ ట్ నువ్వే) చేస్తున్నానని అన్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఆయన చేసిన పాత్ర తర్వాత బ్రహ్మాజీకి ఎక్కువగా కామెడీ రోల్స్ చేసే అవకాశాలు వస్తున్నాయి.

బ్రహ్మాజీ ఈ విషయాన్ని చెప్తూ, నెక్స్ ట్ నువ్వే చిత్రంలో తాను ఎక్కువసేపే స్క్రీన్ మీద కనిపిస్తానని, ఈ చిత్ర కథంతా ఓ హోటల్ చుట్టూ నడుస్తుందని అన్నారు. ఇది పూర్తిగా వినోదా త్మక చిత్రమని తెలిపారు.
కృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఇటీవల విదేశంలో షూటింగ్ ముగించుకొచ్చిన బ్రహ్మాజీ, ఈ చిత్రంలో తాను నానీ మిత్రుడిగా నటించినట్టు తెలిపారు.

ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులతో నటించిన బ్రహ్మాజీ ఇప్పుడు యువనటులతో కలిసి నటించడం కూడా బాగానే ఉందని అన్నారు.

రంగస్థలం 1985 అనే శీర్షికతో త్వరలో రానున్న చిత్రంలో బ్రహ్మాజీ ఓ విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో కథానాయకుడు రామ్ చరణ్. అలాగే మహేష్ బాబుతో చేస్తున్న భరత్ అనే నేను చిత్రంలోనూ బ్రహ్మాజీ ఎక్కువసేపే స్క్రీన్ మీద కనిపిస్తారు.

Send a Comment

Your email address will not be published.