"బ్రహ్మోత్సవం" లో

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “బ్రహ్మోత్సవం” సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు నటించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ తుదిమెరుగులు దిద్దుకుంటుంది. అలాగే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను ఎంపిక చేసే పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నాడు అంటే మే 31వ తేదీన ప్రారంభం కాబోతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ స్వరాలూ అందిస్తారు.

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తుదిదశకు చేరుకుంది. ఈ సినిమాలో మహేష్ జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు.

ఇలా ఉండగా మహేష్ బాబు తన తండ్రి సినిమాల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.

“తెలుగు సినిమా గర్వించే వ్యక్తుల్లో మా నాన్న గారికి ఎప్పుడూ స్థానం ఉంటుంది. సినిమాల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. నా వరకు నాకు ఎప్పటికే నాన్నే ఆదర్శం” అని మహేష్ బాబు ట్వీట్ చేసారు.

కృష్ణ సినిమాల్లోకి అడుగుపెట్టి మొన్న మార్చి 31కి సరిగ్గా 50 ఏళ్ళు పూర్తి అయ్యాయి. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అప్పట్లో కొత్త వాళ్ళతో తీసిన ‘తేనెమనసులు’ మార్చి 31, 1965న విడుదలై సంచలన విజయం సాధించింది. అందులో కృష్ణే కథానాయకుడు. ఈ చిత్రం విజయం తర్వాత కృష్ణ వెనుతిరిగే అవసరం లేకుండా వరుస చిత్రాలతో నటశేఖరుడిగా ఎదిగారు. సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు.

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగానే కాకుండా స్టూడియో అధినేతగా కూడా కృష్ణ తానూ చేపట్టిన అన్ని బాధ్యతలను సమర్ధంగా నిర్వహించారు.

కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో ముందున్నారు.

Send a Comment

Your email address will not be published.