నాగార్జున 'భాయ్'

అన్నమయ్య… శ్రీ రామదాసు …. షిర్డీ సాయిబాబా వంటి ఆధ్యాత్మిక క్యారెక్టర్లతో అభిమానులని భక్తిరసంలో ముంచి తేల్చిన గ్రీకువీరుడు నాగార్జున ఢమురకం, గ్ర్రీకువీరుడుతో తిరిగి యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అవి ఆశించినంత విజయాన్ని దక్కించు కోలేదు. అందుకే ఈసారి పూర్తి మాస్ ఎంటర్ టైన్ మెంట్ తో భాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

నాగార్జున ఈ సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు పాత్రలు పోషించారు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు వీర భద్రం. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా చేశారు.

సినిమా కధ విషయానికి వస్తే
మాఫియా డాన్ డేవిడ్ కి భాయ్ కుడి భుజం లాంటి వాడు. హైదరాబాద్ లో డేవిడ్ గ్యాంగ్ చేసే పనులకి అనుక్షణం అడ్డు తగులుతాడు ఒక పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ అధికారిని అడ్డు తొలగించుకొని మాఫియా పనులకి అంతరాయం కలగకుండా చూసేందుకు భాయ్ ని ఇక్కడకు పంపుతాడు డేవిడ్. పోలీస్ అధికారి ప్రసన్న వివరాలు తెలుసుకొని అతన్ని చంపేందుకు భాయ్ సిద్ధమౌతాడు. ఇంత లోపు పోలీస్ ఆఫీసర్ ప్రసన్న స్వయం గా తన తమ్ముడే అని భాయ్ కి తెలుస్తుంది. చిన్నప్పుడే భాయ్ ఇంటి నుంచి పారి పోతాడు. ఆ తర్వాత తన వారికి దగ్గరై చెల్లి పెళ్లి కూడా చేయాలనుకొంటాడు. అయితే ప్రసన్న వల్ల తన చిన్న కొడుకుని పోగొట్టుకున్న డేవిడ్ పగ తీర్చుకోడానికి పెద్ద కొడుకుతో కలిసి హైదరాబాద్ వస్తాడు. వారి బారి నుంచి భాయ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడు కున్నాడు అన్నదే. ముఖ్యపాత్రల్లో సోనుసుద్, ఆశిష్ విద్యార్ధి, జయప్రకాశ్ రెడ్డి, బ్రమ్హానందం, ఎం.ఎస్.నారాయణ వంటి వారు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగతం అందివ్వగా, సమీర్ రెడ్డి చాయాగ్రహణం అందించారు.

Send a Comment

Your email address will not be published.