భిన్న పాత్రల్లో విక్రం

విక్రమ్,నయనతార,నిత్యామీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. శిబు థమీన్స్ నిర్మించిన ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చారు.

ఏదో ఒక కొత్తదనంతో ప్రేకషకుల ముందుకు వచ్చే విక్రంకు తాను పోషించే పాత్రకు వంద శాతం అంకితమై నటిస్తాడు అనే పేరు పొందిన విక్రం సినిమాలనగానే ప్రేక్షకుడు ఓ అంచనాకోస్తాడు.
ఇప్పుడు తాజాగా నటించిన ఇంకొక్కడు చిత్రంలో విక్రం భిన్నమైన పాత్రల్లో అభిమానులను అలరించాడు.

కథలోకి వెళ్తే విక్రం ఓ శాస్త్రవేత్త. అతను ఓ మందుని కనిపెట్టాడు. ఆ మందు ప్రభావం ఏమిటంటే వృద్ధుడు సైతం ఎదుటివారిపై సులభంగా దాడి చేయగలగడన్న మాట. అతని ఈ క్యారక్టర్ పేరు లవ్. అయితే ఈ మందుతో పడగలెత్తుదామని అనుకుంటాడు. దానితో అతను చెడు పనులు చేయడం ఆరంభిస్తాడు. అందులో భాగంగానే అతను మలేషియాలోని ఓ భారతీయ కార్యాలయంఫై దాడికి పాల్పడతాడు. ఈ దాడి కి పాల్పడింది లవ్ అని తెలిసిపోతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిత్యామేనన్ కి అప్పగిస్తారు. ఆమె పాత్ర పేరు అరుషి.

ఈ సమయంలోనే అరుషికో విషయం తెలుస్తుంది.

లవ్ వల్లే మాజీ రా ఏజెంట్ అయిన అఖిలన్ పాత్రలో నటించిన విక్రమ్ తన భార్య మీరాను కోల్పోతాడు అన్నదే ఆ విషయం. మీరా పాత్రలో నయనతార నటించింది. దీంతో అఖిలన్ కు ఈ దాడి విషయం చెప్పి లవ్ ను హతమారిస్తే తన పగ కూడా తీరుతుందని అతనిని తీసుకొని మలేషియాకు వెళ్తుంది. ఇక ఈ క్రమంలో ఏం జరిగింది? లవ్ మీరాను ఎందుకు చంపాడు? అఖిల్, లవ్ ను ఎలా అంతమొందిస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను వెండితెరపై చూడాలి.

రెండు పాత్రల్లోనూ విక్రమ్ నటన అమోఘం. అఖిలన్ పాత్ర కంటే లవ్ పాత్రలో విక్రం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇక హీరోయిన్స్ నయనతార, నిత్యామీనన్ తమ పాత్రలకు తగినట్టే నటించారు. నాజర్, తంబిరామయ్య, కరుణాకరన్ తదితరులు కూడా నటించిన ఈ చిత్రంలో హారీష్ జైరాజ్ సంగీతం ఓ మోస్తరు ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆహా ఓహో అనిపించుకున్న హారిస్ జైరాజ్ స్వరపరచిన పాటలు బిలో యావరేజ్ గా ఉన్నాయి. పది కాలాల పాటు గుర్తుండిపోయే పాటలు కావు. శశాంక్ మాటలు రాసారు.
దర్శకుడు ఆనంద్ శంకర్ కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో తాను ఎంచుకున్న కథను మలిచాడు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ విసుగు పుట్టించేలా ఉంది.

Send a Comment

Your email address will not be published.