మంచి విలువల శ్రీమంతుడు

ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ హీరోగా కొరటాల శివ (రచన కూడా) దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ చిత్రానికి నిర్మాతలు నవీన్ రవికిశోర్. మోహన్.

మహేష్ బాబు సరసన శ్రుతి హాసన్ నటించింది. జగపతి బాబు, రాజేంద్ర పసాద్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్, ఆలీ, సుకన్య, తులసి తదితరులు ఈ చిత్రంలో నటించారు.

మంచి విలువలతో కూడిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదిరిపోయింది.

హర్ష పాత్రలో నటించిన మహేష్ బాబు కోట్ల ఆస్తికి వారసుడు. మహేష్ బాబు తండ్రిగా జగపతి రవికాంత్ పాత్రలో నటించాడు. తన వ్యాపారాన్ని మహేష్ బాబు వారసత్వంగా స్వీకరించాలన్నది జగపతి బాబు కోరిక. కానీ మహేష్ బాబుకి వ్యాపారం మీద ఆసక్తి లేదు. అతనెంత సేపూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనుకుంటాడు. ఇంతలో అతనికి చారుశీల పాత్రలో నటించిన శ్రుతి హాసన్ పరిచయమవుతుంది. ఆమె ప్రేమలో పడతాడు మహేష్ బాబు. తనకు తెలిసిన నిజాలు తెలుసుకోవడానికి మహేష్ బాబు దేవరకోట గ్రామానికి వెళ్తాడు. అయితే ఆ ఊరితో జగపతిబాబుకి ఉన్న సంబంధమేమిటి … ఆ గ్రామానికి వెళ్ళిన మహేష్ బాబు ఏం చేసాడు…ఆ ఊళ్ళో అతనికి ఏవైనా అడ్డంకులు ఎదురయ్యాయా ..ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొన్నాడు వంటి విషయాలన్నీ వెండితెర మీద చూసి తీరవలసిందే. ప్రతీ సన్నివేశం చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మహేష్ బాబుని చిత్రీకరించిన తీరు అమోఘం…అద్భుతం… మహేష్ బాబు, శృతి హాసన్ మధ్య సాగిన ప్రేమ సన్నివేశాలు అభిమానులకు మంచి విందే. కథనం ఇట్టే అర్ధమైనట్టే అనిపించినా విసుగు అనిపించదు ప్రేక్షకుడికి. ఫస్ట్ హాఫ్ లో సరదాగా సాగిన సన్నివేశాలు, సెకండ్ హాఫ్ లో కాస్తంత పట్టు బించిన సన్నివేశాలతో కథనం సాగుతుంది.

కొరటాల మాటలు బాగున్నాయి. సందర్భోచితంగా ఉన్నాయి.

మహేష్ నటన సింప్లీ సూపర్బ్. ఈ సీను ఆ సీను అని కాదు అన్ని సన్నివేశాల్లోనూ అతని నటన చూసే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. హీరోయిన్ శ్రుతి గ్లామర్ గురించి వేరేగా చెప్పక్కరలేదు. అలాగే నటన కూడా. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరుల నటన కూడా బాగుంది.

Send a Comment

Your email address will not be published.