మగమహారాజు..

కొద్ది రోజుల క్రితమే విడుదలైన చిత్రం మగమహారాజు…సి సుందర్ దర్శకత్వంలో విశాల్ నిర్మించిన చిత్రమే మగ మహారాజు. ఈ చిత్రానికి సంగీతం స్వరపరచింది హిప్ హిప్ తమీజావిశాల్, హన్సిక, వైభవ్ రెడ్డి, సంతానం, రమ్యకృష్ణ, మధురిమ, మధులత తదితరులు నటించిన ఈ చిత్రంలో విశాల్, హన్సిక జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో సినిమా అంబాల అని వచ్చిన సినిమానే తెలుగులో మగమహారాజుగా సమర్పించారు.

వ్యాపారం చేస్తూ మిత్రులతో కలిసి జీవితాన్ని హాయిగా సాగించే పాత్రలో విశాల్ నటించాడు.

అతను అనుకోకుండా హన్సికతో ప్రేమలో పడతాడు. కొన్ని కారణాలతో ఆమె  అతనికి దూరమవుతుంది. ఆ సమయంలో అతనికి తన తల్లి వల్ల తన తండ్రి గురించి తెలుస్తుంది. ఆ తర్వాత విశాల్ తన తండ్రి ఆచూకీ కోసం తిరుగుతాడు. విశాల్ తండ్రి పాత్రలో ప్రభు నటించారు. ఆ తర్వాత అతనికి  తమ్ముళ్ళ వివరాలు తెలుస్తాయి.  ఆ ముగ్గురు కొడుకుల్నీ తండ్రి ఓ కోరిక కోరుకుంటాడు.  ఈ క్రమంలో విశాల్ సోదరులు ఎటువంటి కష్టాలు పడ్డారు? వాళ్ళ ముగ్గురూ  భార్యలకు ఎలా దగ్గరయ్యారు? తండ్రిని క్షమించేరా?  లేదా? దూరమైపోయిన విశాల్, హన్సిక మళ్ళీ కలుసుకున్నారా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే “మగ మహారాజు” చూడాలి.

ఈ చిత్రంలో విశాల్ భిన్నమైన కనిపించకపోయినా ఇచ్చిన పాత్రకు తగు న్యాయం చేసాడు అనే టాక్ వచ్చింది.ఈ చిత్రంలో హన్సిక ఎంతో గ్లామర్ గా కనిపించింది.

హన్సికతో పాటు మధురిమ, మాధవీలతా కూడా బాగానే గ్లామరస్ అమ్మాయిలుగా కనిపించారు.

కథ, కథనం, ఓ మోస్తరుగా ఉంది.  విలన్ పాత్ర మామూలుగా ఉంది. శశాంక్ వెన్నెలకంటి మాటలు రాసారు. సుమారుగా ఉన్నాయి డైలాగులు ఉన్నాయి. పాటలు బాగులేదు.

 

Send a Comment

Your email address will not be published.