మజ్నుతో బిజీ బిజీ

నాగచైతన్య బిజీవిజీగా ఉన్నాడు. మలయాళంలో వచ్చిన ప్రేమం అని చిత్రాన్ని తెలుగులో పునర్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం పేరు “మజ్ను” . ఇందులో నాగచైతన్య హీరో కాగా ముగ్గురు తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారిలో ఇద్దరు మలయాళంలో నటించిన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ తెలుగు మజ్నులోనూ ఓకే అయ్యారు. ఇక మూడో కథానాయికగా ఐశా శర్మ, రెజీనా కాసాన్డ్రా లేదా రాకుల్ ప్రీత్ – వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని టాక్ వచ్చినప్పటికీ చివరికి చిత్ర నిర్మాతలు మడోన్నా సెబాస్టియన్ ను ఖాయం చేసినట్టు నిర్మాతల సన్నిహిత వర్గాల భోగట్టా. ఆమె మలయాలంలోనూ నటించారు. అదే పాత్రలో తెలుగు మజ్నులో ఆమె నటిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో నాగ చైతన్య మూడు దశల్లో కనిపిస్తాడు. అవి – టీనేజ్, కాలేజీ యూత్, పరిపక్వతకు వచ్చిన యువకుడి పాత్ర.

Send a Comment

Your email address will not be published.