మనముందు కరెంట్ తీగ

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కరెంటు తీగ సినిమా అక్టోబర్ 31న విడుదల అయ్యింది. జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్, రకుల్ ప్రీత్, సన్నీ లియోన్, జగపతి బాబు తనికెళ్ళ భరణి, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ సినిమా కథలోకి వెళ్తే శివరామరాజు (జగపతి బాబు) పార్వతీ పురం పల్లె పెద్ద. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. మొదటి ఇద్దరు అమ్మాయిలకు పెద్దలు చూసి చేసిన పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక మూడో అమ్మాయికి పెళ్లి జరగాలి. ఆ అమ్మాయి (రకుల్ ప్రీత్, సినిమాలో ఆమె కవితగా నటిస్తుంది) కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ వూరిలో శివరామరాజు వ్యతిరేకి వీర్రాజు. అతను శివ రామరాజుని మూడో అమ్మాయి గురించి హెచ్చరిస్తూ ఉంటాడు. ఏదో రోజు ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించానని చెప్పి వెళ్ళిపోతుందని. అదే ఊళ్ళో ఉంటున్న  కుర్రాడు రాజు (మంచు మనోజ్) కవితను ప్రేమిస్తాడు. రాజు, కవితల ప్రేమ వ్యవహారాన్ని జగపతి రాజు ఆపడానికి ప్రయత్నిస్తాడు. వీరి ప్రేమ వల్ల తనకున్న పలుకుబడి, పెద్దరికం దెబ్బతింటుందని జగపతి బాబు ఆలోచిస్తాడు. అయితే చివరికి రాజు, కవితల పెళ్లి జరగడం, జగపతి బాబు మనసు మార్చుకోవడం ఎలాగన్నది వెండితెర పై చూడాలి.
మంచు మనోజ్, రకుల్ ప్రీత్, జగపతి బాబు నటన బాగుంది.
తమిళంలో వచ్చిన వరుత్తపడాద వాలిబార్ సంఘం అనే సినిమానే తెలుగులో అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసి పునర్ నిర్మించారు. కథలో మలుపులు ఏమిటో ముందుగా ఊహించే విధంగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచం సాగదీసినట్టు అనిపిస్తుంది. సంగీతం సాధారణంగా ఉంది. గొప్పగా ఏమీ లేదు.

Send a Comment

Your email address will not be published.