‘మనలో ఒకడు’ చిత్రం ఓ మోస్తరు!

గురుజాల జగన్మోహన్ నిర్మాతగా ఆర్.పి.పట్నాయక్ సారధ్యంలో వచ్చిన చిత్రం “మనలో ఒకడు” చిత్రం.

ఆర్పీ పట్నాయక్, అనిత, సాయికుమార్. నాజర్, తనికెళ్ల భరణి, బెనర్జీ, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం సమకూర్చారు. తిరుమల్ నాగ్ మాటలు రాసారు.
సంగీత దర్శకుడిగా పరిచయమై అనంతరం నటుడిగా మారిన పట్నాయక్ దర్శకత్వం కూడా వహించాడు. మరిప్పుడు ఇన్ని బాధ్యతలు చేపట్టిన పట్నాయిక్ ఈ చిత్ర కథను ఎలా నడిపించాడో చూద్దాం.

కృష్ణమూర్తి పాత్రలో నటించిన ఆర్పీ పట్నాయిక్ ఒక కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తూ ఉంటారు. అతనికి మంచి పేరే ఉంది. అయితే ఇంతలో ఓ మలుపు చోటు చేసుకుంటుంది. ఒక టీ వీ చానల్ చేసిన పొరపాటుతో అతని జీవితంలో ఓ మలుపు అనివార్యమవుతుంది. జీవితం గందరగోళమవుతుంది. అయితే ఆ టీ వీ చానల్ చేసిన పొరపాటు ఏమిటీ, ఆర్పీ పట్నాయిక్ తనకు ఎదురైనా సమస్యను ఎలా ఎదుర్కుని తనపై వచ్చిన అపవాదు నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలంటే చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

ఈ కథ ప్రస్తుత సమాజానికి సరిపోయేదే. మీడియా పోకడలు, వాటి ప్రభావాలూ ఎలా ఉన్నాయనే వాటికి ఈ చిత్ర కథనం అద్దం పడుతుంది. మొత్తం మీద చూస్తే కథ బాగుంది. కానీ ఓ చిన్ని సంఘటనను ఓ పెద్ద సినిమాగా తయారు చేయడమే కాస్త ఆలోచించేలా చేస్తుంది ప్రేక్షకుడిని.

నటుడిగా ఆర్పీ పట్నాయక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతని హావభావాలు చాలా చాలా మామూలుగా ఉన్నాయి. సాయికుమార్, నాజర్, బెనర్జీ, భరణి తమ తమ పాత్రలకు తగు న్యాయం చేసారు. కథానాయికగా అనిత నటన పరవాలేదు.

ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని మరీ ఆహా ఓహో అని పొగడడానికి వీలు లేదు. పరవాలేద అంతే.
జేసుదాసు “మధురమే మధురమే” అంటూ పాడిన పాట బాగుంది. నేపథ్య సంగీతం గొప్పగా లేదు.

Send a Comment

Your email address will not be published.