మనసులోని మాట

బాలీవుడ్ లో తనకెదురులేని బ్యూటీ క్వీన్ గా వెలిగిపోతున్న కత్రినా కైఫ్ తన మనసులోని మాటల్ని చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం….

మీడియాలో కొందరు పని గట్టుకుని నన్ను కించపరుస్తూ అవీ ఇవీ రాస్తున్నారు. అవి చదువుతుంటే వెగటు పుడుతోంది. అందుకే ఆలాంటి వాటికి దూరంగా ఉండదలిచాను.

ప్రతి సిని తారకూ తమకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉండి తీరుతుంది. దీనికి ఎవరూ అతీతులు కారు. కనుక నటీనటులు తమకు చెందిన అన్ని విషయాలను ఎవరికి పడితే వారికి చెప్పవలసిన అవసరం లేదు. ఎవరి అంతరంగం వారిది.

నేనెవరినీ అంత సులువుగా అర్ధమవను. నన్ను నేను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటాను. ఏకాంతంలో ఉన్నప్పుడు నేను సాధించినవి, సాధించవలసినవి అనుకుని వాటికి తగ్గట్టు ఒక ప్రాణాలిక రూపొందించుకుని దానికి తగ్గట్టు నడచుకుంటాను. నన్ను నేను ప్రశ్నించుకుని వాటికి జావాబులు చెప్పుకుంటాను. నేని ఏదైనా ఒకటి అనుకుంటే అది సాదించేవరకు విశ్రమించను.  సవాళ్ళను ఎదుర్కోవడం నా మనసుకు ఇష్టం.

నా మనసుకి ఏది ఆనందమిస్తుందో అది చెయ్యడానికి ఇష్టపడతాను.

లోకానికి నేను ఎలా పరిచయమవుతానన్నది ప్రతీ వ్యక్తికి ముఖ్యం. అలాకాకుంటే మనల్ని విమర్శించడానికి ఎదుటివారికి అవకాసం ఇచ్చినట్లు అవుతుంది. అది సరికాదు.

నాకు నచ్చనివారితో మాట్లాడాల్సిన అగత్యం ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను.

నాలో ఆత్మ విశ్వాసం పెంచిన వారిలో అక్షయకుమార్ ఒకరు.

అక్షయకుమార్ జంటగా నేను వెండితెర మీద అందంగా కనిపిస్తానని నా అభిప్రాయం.

సల్మాన్ ఖాన్ అంత సులభంగా అర్ధం కాదు. అతను దేనికీ చలించడు.

షారూక్ ఖాన్ చురుకైన వాడు. అతను ఏక కాలంలో ఎన్నో పనులు చేయగల సమర్థుడు. తెలివైన వాడు. ఏదైనా చెయ్యాలంటే వెనుకాడడు. అనుకున్నదానిని చెయ్యవలసివచ్చినప్పుడు  అది ఎంత కష్టమైనదైనా చేస్తాడు. అతని పనిలో తపన తపన చూడవచ్చు.

Send a Comment

Your email address will not be published.