మనోగతం

త్వరలో రాబోయే జనతా గ్యారేజ్ చిత్ర ఆడియో విడుదల సంబరాలలో ఎన్ఠీఆర్ తన మనోగతాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఈ జనతా గ్యారేజ్ చిత్రం అన్ని విధాలా విజయవంతం అవుతుందనే ధీమాను వ్యక్తం చేస్తూ అందుకు కారణం చిత్రం గొప్పగా రూపొందినట్టు చెప్పాడు. అయితే అదే సమయంలో గతంలో తాను నటించిన చిత్రాలలో కొన్ని విఫలమవడాన్ని కూడా ప్రస్తావిస్తూ అప్పుడు తాను చవిచూసిన క్షణాలను పేర్కొన్నారు.

“కొత్తచిత్రం విడుదల అయ్యే ప్రతిసారీ అభిమానుల రుణం తీర్చుకోవచ్చని అనుకుంటాను. కానీ అది ఎప్పటికీ జరగదేమో.. అలా జరగనప్పుడల్లా వెళ్లిపోయి మీ రుణం తీర్చుకోవడానికి మళ్లీ పుడతానేమో! ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో.. ఈ జన్మలో ఆ మహానుభావుడికి (నందమూరి తారకరామారావు) మనవడిగా పుట్టడం జరిగింది. ఓ అద్భుతమైన తల్లిదండ్రలకు పుట్టాను. మీలాంటి అన్నలకు తమ్ముడిగా, మీలాంటి తమ్ముళ్లకి అన్నగా పుట్టాను…..చాలా చెప్పాలనే అనుకున్నాను…. మనసు విప్పి మాట్లాడాలని కూడా ఉంది. అలా చెబితే నన్ను నేను తగ్గించుకోవడానికి మాట్లాడినట్లుగా ఉంటుందేమో. కానీ నిజం మాట్లాడితే తగ్గించుకోవడం కాదు. మొదట నిన్ను చూడాలని చేసినప్పుడు ఎక్కడికెళ్తున్నానో, ఏమవుతున్నానో అర్ధం కాలేదు. ఆది, సింహాద్రి సినిమాలు వచ్చాయి. అంతా ఇంతే అనుకున్నాను. ఏమీ అర్ధం కాలేదు.. చిన్న వయసులో తెలీలేదు. కింద పడిపోతేనే తెలుస్తుంది. దేవుడి కంటే గొప్పోళ్లం అయిపోలేం కదా అని. చాలా సినిమాలు చేసినా.. నా మీద ప్రేమతో నా మీద అభిమానంతో ఆశతో మీరు బాధ పడటం చూశాను. నాలో నేను బాధ పడ్డాను. నాలో నేను ఎంతగా కుమిలిపోయానో చెప్పలేను. “నాన్నకు ప్రేమతో”…..చిత్రం అప్పుడు చాలామంది నేను ఈ గెడ్డం పెంచినపుడు ఎలా రిసీవ్ చేసుకుంటారని అన్నారు. అది విజయం సాధించిన తర్వాత ఆ గమ్యం ఇంకా దగ్గరైంది. ఆ తర్వాత ఇప్పుడు అర్ధమైంది…అదే జనతా గ్యారేజ్” అని జూనియర్ ఎన్ఠీఆర్ తన మనసులోని మాటల్ని చెప్తుంటే ప్రాంగణం చప్పట్లతో హోరెత్తింది.

Send a Comment

Your email address will not be published.