మనోజ్ చిత్రంలో సన్నీ లియోన్

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న “కరెంట్ తీగ” చిత్రంలో సన్నీ లియోన్ నటించేందుకు సమ్మతించింది. సన్నీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్ లో కనిపించే ఈ సినిమాను మనోజ్ సోదరుడు విష్ణు నిర్మిస్తున్నారు. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది.

గతంలో సన్నీతో సినిమా చేయడానికి అనేకమంది టాలీవుడ్ నిర్మాతలు క్యూ కట్టినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. కారణం సన్నీ భారీ మొత్తంలో డబ్బులు అడగడమే. ఆమె అడిగినంత ఇచ్చుకోవడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. అయితే మంచు విష్ణు సన్నీని తన సినిమాలో ఎలాగైనా నటింప చేయాలని అనుకున్నారు. సన్నీ ఈ చిత్రంలో టీచర్ గా నటిస్తుంది.

సన్నీ ఇప్పటికే బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించేందుకు ఇప్పటికే బాటలు వేసుకుంది కూడా.

ఇక ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో ఎలా క్లిక్ అవుతుందో వేచి చూడాలి.

Send a Comment

Your email address will not be published.