‘మన ఊరి రామాయణం’

ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో ఆయనే స్క్రీన్ ప్లే సమకూర్చుకుని తీసిన చిత్రమే “మన ఊరి రామాయణం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి కూడా ప్రకాష్ రాజ్ కావడం గమనార్హం. ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. జో మాథ్యూ అనే ఆయన కథకు ప్రకాష్ రాజ్, రమణ గోపిశెట్టి మాటలు రాసారు. ప్రకాష్ రాజ్, రామ్ జీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రకాష్ రాజ్

అదొక చిన్న పట్టణం. ఆ ఊళ్ళో మంచి పేరున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఆయనంటే అందరికీ గౌరవం. ఆయనను చాలా మర్యాదగా చూసే వారు. చిత్రంలో ఆయన పాత్ర పేరు భుజంగయ్య.
ఆరోజు రాత్రి భుజంగయ్య తన ఇంట్లో వారితో గొడవపడతాడు. అంతేకాదు, ఆరోజు రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. భుజంగయ్య. అతనికి ఓ విచిత్రమైన కోరిక కలుగుతుంది. అదేమిటంటే తప్ప తాగి ఆ మత్తులో ఒక అమ్మాయితో గడపాలని అనుకుంటాడు.

అంతే మరునిమిషమే అతను తన దగ్గర పని చేస్తుండే శివ పాత్రలో నటించిన సత్యదేవ్ ను అందుకోసం వాడుకుంటాడు. శివ వెళ్లి ఓ వేశ్యను పిల్చుకొస్తాడు. ఈ పాత్రలో ప్రియమణి నటించింది. కథలో ఆమె పేరు సుశీల.
వీరిద్దరినీ ఒక షాపులో ఉంచి బయటికి వెళ్లిన శివను పోలీసుల పట్టుకుంటారు.
మరోవైపు భుజంగయ్య, సుశీల ఆ షాపులోపల ఉండిపోతారు. అయితే ఈ స్థితిలో భుజంగయ్య, సుశీల ఏ విధంగా బయటకు వచ్చారు…. భుజంగయ్యలో ఏదైనా మార్పు వచ్చిందా…వస్తే ఎలా మారాడు వంటి ప్రశ్నలకు జవాబు కావాలంటే మన ఊరి రాయానం చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

విభిన్నమైన కథను తీసుకుని దానిని చక్కటి మలుపులతో నడిపించిన ప్రకాష్ రాజ్ సమర్పించే ఇటువంటి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు కూడా ఆదరించాలి కదా. కథలోని ఉద్వేగానుభూతులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.

కథ బాగుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఈ చిత్రంలో చెప్పుకోవలసిన లోటు ఏమిటంటే ఎక్కువ సన్నివేశాలు ఒకే లొకేషన్ లో చిత్రీకరించడమే. చూసే వారి సహనానికి ఇది ఓ పరీక్షే. పైగా పాత్రలు కూడా పరిమితమే కావడం మరొక అంశం.

కానీ ఒక్కటి, కథను నడిపించిన తీరు ఎలా ఉన్నా ముగింపు బాగుండటం వల్ల ప్రకాష్ రాజ్ మీద ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గాడు. పైపెచ్చు పెరుగుతుంది కూడా.

నాల్లుగేళ్ళ క్రితం మలయాళంలో వచ్చిన ‘షట్టర్’ అనే చిత్రాన్నే తెలుగులో పునర్నిర్మించారు. కానీ తెలుగు నేటివిటీకి ఏ మాత్రం లోపం జరగలేదు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ప్రయత్నాన్ని అభినందించక తప్పదుఏదేమైనా “మన ఊరి రామాయణం” చూడదగ్గ చిత్రం.

ప్రకాష్ రాజ్ నటన సింప్లీ సూపర్బ్. అతను తన హావభావాలతోనే ప్రేక్షకులను కట్టిపడేసాడు. కథానాయిక ప్రియమణి నటన కూడా చాలా బాగుంది. పృథ్వీ, సత్యదేవ్ తదితరులు కూడా బాగానే నటించారు.

Send a Comment

Your email address will not be published.