మన ముందు 'వీరుడొక్కడే'

అజిత్, తమన్నా జంటగా శివ దర్శకత్వంలో తమిళంలో విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన వీరం చిత్రం ఆ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ వీరుడొక్కడే పెరుతు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం మార్చి 21వ తేదీన విడుదలైంది. మూలం తమిళమే అయినప్పటికీ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే చిత్రమిది. అజిత్, తమన్నాలతో పాటు నాజర్, ప్రదీప్ రావత్, అతుల్ కుల్కర్నీ,రోహిణీ హట్టంగడి, తదితరులు ఈ చిత్రంలో నటించారు. వీరందరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించారు. డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ కలగని విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నలుగురు అన్నదమ్ముల మధ్య జరిగిన కథ ఇది. సెంటిమెంటుకు, ఎమోషన్స్ కు, యాక్సన్ అంశాలకు లోటు లేని కథనం. దాదాపు మూడు వందల హాల్స్  లో వీరుడొక్కడే తన తడాఖా చూపిస్తున్నాడు.

Send a Comment

Your email address will not be published.