మరదలు పిల్ల

జాతీయ గీతాలు పాడితే టంగుటూరి సూర్య కుమారి పాడాలి అని ఒక ముద్ర వేయించుకున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు సోదరుని కుమార్తె అయిన సూర్యకుమారి కాంగ్రెస్ సభలలో జాతీయ గీతాలు పాడి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె మొత్తం పదనాలుగు చిత్రాలలో నటించారు. వాటిలో రెండు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అవి వతన్  (ఇది 1954 లో వచ్చింది), ఉడన్ ఖటోలా (ఇది 1955 లో వచ్చింది). ఈ రెండు చిత్రాలలో ఆమె పాడలేదు. తమిళంలో మూడు చిత్రాలలో నటించారు. అవి – విప్రనారాయణ (1937), కటకం (1947), సంసార నౌక (1948). మరొకటి కన్నడ చిత్రం …పేరు – భారతి (1949). మిగిలినవి తెలుగు సినిమాలు. ఈ తెలుగు చిత్రాలన్నిటిలో ఆమెకు అన్నీ పాటల వేషాలే ఇచ్చారు. ఆమె చివరి చిత్రం రామదాసు (1964). ఈ చిత్రంలో ఆమెతో తానీషా భార్యగా పాడిన పాత రికార్డు చేశారు గానీ షూట్ చేయలేదు. ఆమె జాతీయ గీతాలు పాడటం చూసి ఆమెను మొదటి చిత్రానికి బుక్ చేసారు. ఆ చిత్రం విప్రనారాయణ. అయితే అది పెద్ద వేషమేమీ కాదు. విప్రనారాయణతో కలిసి శ్రీరంగాని గురించి పాడే ఆశ్రమవాసి వేషం. ఆమె హీరోయిన్ వేషం వేసిన ఒకే ఒక తెలుగు చిత్రం మరదలు పిల్ల. ఇది 1951 లో వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకులు వీ నాగయ్య, టీ సూర్యకుమారి అని పేర్లు వేశారు.

Send a Comment

Your email address will not be published.