కమల హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ మరోసారి గాయకిగా ఒక పాట పాడింది.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో శ్రుతి హాసన్ ఈ పాట పాడింది. ఆమె పాడిన పాట పల్లవి ….. డౌన్ డౌన్ డౌన్ డుప్పా…
ఆమె సినిమాల్లో పాడటం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆమె ఈనాడు, ఓ మై ఫ్రెండ్ అనే చిత్రాల్లోనూ పాటలు పాడింది.
అయితే ఇప్పుడు పాట పాడటమే కాదు, అల్లు అర్జున్ తో కలిసి ‘ఈ రేసు గుర్రం’ చిత్రంలో కథానాయకిగా కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగు దాదాపుగా పూర్తయింది.
ఉషా ఉతుప్ కూడా ఒక పాటను ఈ చిత్రంలో పాడారు. ఈ పాట చిత్రీకరణతో ఈ చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, డా. కె వెంకటేశ్వర రావు సంయుక్తంగా ‘ఈ రేసు గుర్రం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి బ్రహ్మానందం హాస్యం హైలైట్ కాబోతోంది.
తమన్ సంగీతం సమకూరుస్తున్న రేసు గుర్రం చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేస్తారు.