మరో ప్రేమ కథ - ‘చెలియా’

ఇప్పుడు మరో ప్రేమ కథతో మణిరత్నం ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

కార్తి, అదితి రావు హైదరి, ఆర్జే బాలాజి, లలిత, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు.

మణిరత్నమే దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్ ప్లే అందించారు. కిరణ్ మాటలు రాయగా దిల్ రాజు నిర్మించారు ఈ చిత్రాన్ని.

కథలోకి వెళ్దాం….

Cheliyaa-movieవరుణ్ అలియాస్ వీసీగా నటించిన కార్తి కాశ్మీర్లో ఇండియన్ ఏవియేషన్ విభాగంలో ఫైటర్ పైలట్ గా పని చేస్తుంటాడు. అక్కడికి లీల పాత్రలో నటించిన డాక్టర్ గా అదితి రావు హైదరి వస్తుంది.

ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రికి వచ్చిన వీసీకి లీలే చికిత్స చేస్తుంది.

ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయంతో ఇద్దరూ దగ్గరవుతారు. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకుందామనే తరుణంలో వీసీ ప్రవర్తన వల్ల వారి మధ్య సంఘర్షణ చోటుచేసుకుంటుంది. అప్పుడే సరిగ్గా కార్గిల్ యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న వీసీ కాస్తా శత్రు సైన్యానికి దొరికిపోతాడు. యుద్ధ ఖైదీగా అతను పాకిస్తాన్ జైలుకి పంపబడతాడు. అయితే అక్కడి నుంచి అతను బయటపడ్డాడా? బయటకు వచ్చి అతను తన ప్రేయసిని మళ్ళీ కలిశాడా? ఇటువంటివన్నీ తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ప్రేమ కథలు పండించడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఒడిసిపట్టుకున్న మణిరత్నం ఈ చిత్రంలో కార్తి-అదితి రావు మధ్య నడిపించిన ప్రేమ సన్నివేశాలు అమోఘం. వారి మధ్య ప్రేమ చూస్తుంటే వారు నిజంగా ప్రేమికులేమో అని అనిపిస్తుంది.

ఎ.ఆర్.రెహమాన్ సంగీతం మనసుల్ని కట్టిపడేస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి రవివర్మన్ ఛాయాగ్రహణం అద్భుతం. ప్రేమికుల మధ్య ప్రేమ గాఢతను రాసమయం చేయడంలో మణిరత్నం మార్క్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ప్లస్ పాయింట్లు నిండుగా ఉన్నా ఓ సామాన్య ప్రేక్షకుడి సహనానికి మాత్రం ఈ చిత్రం ఓ పరీక్షే. కొన్ని చోట్ల “లోతు” అంతగా లేదు. కథ కూడా గట్టిగా లేదు అక్కడక్కడా. దానితో ప్రేక్షకుడిని కాస్త నిరాశ పరుస్తుంది.
ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయాన్ని చిత్రించిన సన్నివేశాలు బాగున్నాయి. కానీ ద్వితీయార్దంలో కథ ఆపసోపాలు పడి నడిచింది.

కార్తి కి నటన బాగుంది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. అదితిరావు అందం చందం, హావభావాలు చిత్రానికి ఆకర్షణే. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు తగినట్టుగా న్యాయం చేసారు.
మొత్తం మీద పరవాలేదు “చెలియా”

Send a Comment

Your email address will not be published.