మరో ప్రేమ కథ

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన మరో ప్రేమ కథా చిత్రం జెంటిల్మన్. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ.

నాని, నివేద థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్ తదితరులు ప్రముఖ పాత్రలలో నటించారు.

కథలోకి వెళ్తే….
విదేశ పర్యటన పూర్తి చేసుకుని స్వదేశమైన భారత దేశానికి వస్తారు అమ్మాయిలు ఇద్దరు. వారిలో ఒకరు – ఐశ్వర్య పాత్రలో సురభి నటించగా, మరొకరు క్యాథరిన్ పాత్రలో నివేదా థామస్ నటించారు. వీరిద్దరూ విమానంలో పక్కపక్కనే కూర్చొని ప్రయాణించిన క్రమంలో స్నేహితులు అవుతారు. వీరు మాటల్లో తమ ప్రేమకథలు ఒకరికొకరు చెప్పుకోవాలనుకోవడంతో సినిమా మొదలవుతుంది. ఈ విధంగా వీరి ప్రేమ కథలు పూర్తవగానే విమానంలో నుంచి దిగిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు క్యాథరిన్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ చనిపోయినట్టు తెలుస్తుంది. గౌతం పాత్రలో హీరో నాని నటించారు.
అయితే గౌతం చనిపోలేదని ఓ పాత్రికేయుడు వచ్చి గౌతమ్ హత్యకు గురైనట్టు చెప్పడంతో క్యాథరిన్ కు అనుమానం వస్తుంది. చూడటానికి అచ్చంగా గౌతమ్ లా ఉన్న ఐశ్వర్యకు కాబోయే భర్త జై (నాని) పై నిఘా పెట్టి క్యాథరిన్ నిజం తెలుసుకోవడం ఆరాటపడుతుంది.

మరోవైపు జై కూడా క్యాథరిన్ కు చిక్కకుండా తప్పించుకోవాలని చూస్తుంటాడు. ఆ సమయంలోనే క్యాథరిన్ కు దొరకబోయే ఒక్కొక్క సాక్ష్యం కనిపించకుండా పోతూ ఉంటుంది. దీంతో క్యాథరిన్ గౌతమ్ ను చంపింది జై అని నిర్ణయించుకుని అతని అసలు రూపాన్ని ఐశ్వర్యకు చూపాలనుకుంటుంది. ఈ క్రమంలో ఓ నిజం తెలుస్తుంది. అయితే . ఆ నిజం ఏమిటో? మంచివాడిగా ఉన్న జై చెడ్డవాడిలా ఎందుకు కనిపిస్తాడు? అసలు గౌతమ్ మాయమై పోవడానికి కారణం ఏమిటి? వంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలి వెండితెరపైన.

నాని పాజిటివ్ గాను, నెగిటివ్ గాను చక్కగా నటించారు. గతంలో చాలాసార్లు ప్రేమికుడిగా చూసిన నాని నటనకు ఈ చిత్రంలో నటనకు ఎంతో తేడా ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఎంతో గొప్పగా నటించాడు. హీరోయిన్ల విషయానికి వస్తే నివేదా థామస్ ప్రేమ సన్నివేశాల్లో అందంగా కనిపించింది. ప్రియుడిని చంపింది ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించే క్రమంలో ప్రతిభావంతమైన నటన చూపింది. నివేదా నటన సినిమాకి ప్లస్ పాయింట్ అనడానికి ఆలోచించక్కర లేదు. సురభి తన పాత్ర మేరకు బాగానే నటించింది. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, ‘సత్యం’ రాజేష్ తదితరులు కూడా బాగా నటించారు.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ తానూ చెప్పదలచుకున్న విషయాన్ని బాగా పండించారు దర్శకత్వంలో . అనుకున్న పాయింట్ ని అనుకున్నట్లుగా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు అచ్చంగా సరిపోయింది.

ఈ చిత్రాన్ని చక్కగా తీయడంలో నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ కు అభినందనలు.

మొత్తంమీద విలువలతో కూడిన చిత్రం జెంటిల్మన్.

Send a Comment

Your email address will not be published.