"మలుపు" మీద ఆశలు

చాలా కాలానికి నటుడు ఆది పినిశెట్టి మలుపు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మలుపు చిత్రం ఆలస్యానికి కారణం అది ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం కావడమే అని ఆది చెప్పారు. ద్విభాషా చిత్రం కావడంతో షూటింగ్ రెండు లోకేషన్స్ లో జరపాల్సి రావడం ఆలస్యానికి ఒక కారణమని ఆయన అన్నారు.

మలుపు చిత్రంలో ఆది ఓ కాలేజ్ కుర్రాడు పాత్రలో నటించారు.

ఆయన తండ్రి పినిశెట్టి రవిరాజా ఈ చిత్రానికి నిర్మాత.

ఆది మాట్లాడుతూ తన సోదరుడు సత్య ప్రభాస్ ఈ చిత్రానికి దర్శకుడు అని, అందుకే తన తండ్రి ఈ ఛిత్రాన్ని నిర్మించాలనుకున్నారని అన్నారు. అంతే కాకుండా తన తండ్రి దర్శకత్వం మీద అంతగా ఆసక్తి చూపలేదని చెప్పారు.

ఒక విచిత్రం చిత్రంతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన ఆది గుండెల్లో గోదారి , వైశాలి చిత్రాల్లో కూడా నటించారు. ఇప్పుడు అతను మలుపు విడుదలపై దృష్టి కేంద్రీకరించారు.

మలుపు కథ ఓ జరిగిన వాస్తవ సంఘటన అంటూ తన సోదరుడు మిత్రుడికి ఎదురైన అనుభవాన్ని కథగా రాసుకుని చిత్రాన్ని సమర్పించడం జరుగుతోందని ఆది అన్నారు. చిత్రం కథ నలుగురు  విద్యార్ధుల చుట్టూ తిరుగుతుందని అన్నారు. ఈ కథ తనకు నచ్చి తన తండ్రి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆసక్తి చూపారని తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ పవర్ ఫుల్ పాత్ర వేసారని ఆది వివరించారు.

అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సరైనోడు అనే ఛిత్రంలో తాను విలన్ పాత్ర పోషిస్తున్నానని చెప్పిన ఆది అయితే అది ఓ నెగటివ్ రోల్ అని, ఆ పాత్రను కథకు తగినట్టు హుందాగా మలిచారని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే అలాంటి నెగటివ్ రోల్స్ లో నటిస్తానని కూడా చెప్పారు. అయితే ఆ సబ్జెక్ట్ తనకు నచ్చాలని తెలిపారు. తమిళంలో రెండు చిత్రాలకు ఒప్పందం కుదిటినట్టు ఆది చెప్పారు.

Send a Comment

Your email address will not be published.