మళ్ళీ తెరపైకి

ఒకప్పుడు టాలీవుడ్  లవర్  బాయ్  గా  ముద్ర  వేసుకున్న తరుణ్ ఇప్పుడు  మళ్ళీ  తెర మీద  కనిపించబోతున్నాడు.

రమేష్ గోపీ  దర్శకత్వంలో వస్తున్న  ఓ  చిత్రంలో ప్రస్తుతం తరుణ్  నటిస్తున్నాడు. ఈ  చిత్రానికి ఇంకా పేరు  పెట్ట లేదు.

ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్  జనవరి  ఏదో తేదీన  విడుదల  చేసారు. ఆరోజు తరుణ్ పుట్టిన రోజు  కావడం గమనార్హం.

తరుణ్  కి ఇప్పుడు మంచి  బ్రేక్  అవసరం.

దాదాపు పదేళ్లుగా  తెర  వెనుకే  ఉండిపోయిన  తరుణ్  కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో దూరమయ్యాడు..  మంచి స్క్రిప్ట్  కోసం  ఇంత  సుదీర్ఘ కాలం నిరీక్షించిన తరుణ్ తీరా ఇప్పుడు ఓ  కన్నడం సినిమా  రీమేక్ లో నటిస్తున్నాడు.  కన్నడంలో ఆ సినిమా  పేరు –  ఆగి  ఒన్ద్.  కన్నడంలో సూపర్  హిట్ చిత్రం ఇది. ఇదొక  ప్రేమ కథ. దీనినే తెలుగులో పునర్  నిర్మిస్తున్నారు.

ఈసారి బలమైన  నటనతో ప్రేక్షకుల  ముందుకు రావాలని వంద శాతం అంకితభావంతో నటిస్తున్నాడు తరుణ్.

ఆల్ ది బెస్ట్  తరుణ్.

Send a Comment

Your email address will not be published.