మళ్ళీ బాలూ, లక్ష్మీ

గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మి జంటగా నటించబోయే కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమధ్య తనికెళ్ళ భరణి సారధ్యంలో వచ్చిన మిధునం చిత్రంలో ఈ జంట నటించి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే కదా….

ఇప్పుడు మళ్ళీ ఈ జంటనటిస్తున్న మరో సినిమా సన్నద్దమవుతోంది. ఈ చిత్రాన్ని ఎస్ పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్ పీ చరణ్ నిర్మిస్తున్నారు. సినిమా పేరు మూడు ముక్కల్లో చెప్పాలంటే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపు దిద్దుకోబోతోంది. క్యాపిటల్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు మధుమిత.

ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకేందుమౌలి హీరోగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు.

రాకేందు సరసన నాయికగా అదితి నటిస్తోంది.

బ్రహ్మానందం, అలీ, తనికెళ్ళ భరణి, కాదంబరి కిరణ్, వెంకీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం  గిర్నిచి ఎస్ పీ చరణ్ మాట్లాడుతూ పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తి అయ్యిందని, తమిళంలో తనకిది ఎనిమిదో చిత్రమని, తెలుగులో మాత్రం ఇది తోలి చిత్రమని అన్నారు. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు. వినోదాత్మక చిత్రమని కూడా చెప్పారు.

ఈ చిత్ర దర్శకులు మధుమిత తమిళంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారని ఎస్ పీ చరణ్ చెప్పారు. త్వరలోనే పాటల చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్త్ఘున్నామని కూడా ఆయన అన్నారు.

ఈ చిత్రానికి మాటలు – వెన్నెలకంటి శశాంక్. సంగీతం కార్తికేయ మూర్తి. చాయాగ్రహణం శ్రీనివాస్.

Send a Comment

Your email address will not be published.