మళ్ళీ బిజీ బిజీగా మధుబాల

రోజా హీరోయిన్ మధుబాల గుర్తున్నారా…? ఇరవై ఏళ్ళ క్రితం తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం తదితర అయిదు భాషల్లో నటించి తనకంటూ లక్షలాది మంది అభిమానులను పొందిన మధుబాల గురించి కొన్ని విషయాలు ఆమె మాటల్లోనే…
నాకు అందం ఉండటానికి కారణం ఆ దేవుడిచ్చిన కానుక. నాకు దర్శకులు బాలచందర్, మణిరత్నం, శంకర్ తదితరుల చిత్రాల్లో నటించే అవకాశం రావడానికి కారణం అదృష్టమేనని అనుకుంటాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను ఓకే చేసాను. దేనిని నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు. అవి వాటంతట అవి వచ్చినవే. అలాగే వచ్చిన వాటిని నేను రిజెక్ట్ చెయ్యనూ లేదు.
నా పెళ్లి కూడా అలాంటిదే. ముందుగా మా వారే  నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు ప్రపోస్ చేసినప్పుడు వెంటనే నేను ఎస్ అని చెప్పాను. ఈ విషయం మా నాన్నగారితో మాట్లాడినప్పుడు ఆయన నన్ను చేసుకోబోయే వారి గురించి వివరాలు అడిగితే నాకు ఒక్కటీ తెలియక చెప్పలేకపోయాను. ఆయన నచ్చడంతో వెంటనే ఓకే అని చెప్పేసాను.
నన్ను వెతుక్కుంటూ వచ్చిన వారిని నేను ఎప్పుడూ నిరాశ పరచను. అది నా సంగతి.
నేను చాలా గ్యాప్ తర్వాత మల్లి నటించాలనుకున్నప్పుడు ముందుగా హిందీలో నటించే అవకాశం వచ్చింది.  ఇంతలో తెలుగులో మంచి స్క్రిప్ట్ రావడంతో ఎందుకు వదులుకోవాలనుకుని తెలుగులోనూ నటించడానికి ఓకే చెప్పాను. ఆ వెంటనే మలయాళంలో అవకాశం వచ్చింది. అల్లాగే తమిళంలోనూ చాన్సు వచ్చింది. ఇదంతా ఏదో ఒక ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. మా అమ్మాయిలిద్దరూ చదువుకుంటున్నారు. అందువల్ల ఎక్కువగా ముంబై  విడిచిపెట్టివెళ్ళని విధంగా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాను. అంతే. అయినా ఉరుకులూ పరుగులు తీస్తున్నట్టే ఉంటోంది.
 త్రిషా అంటే నాకు చాలా ఇష్టం. నయనతారా కూడా బాగానే నటిస్తోంది.
నా ఫేవరిట్ హీరో తమిళంలో విజయ్ (తుపాకీ ఫేం). ఐ లవ్ విజయ్. విజయ్ సినిమాలేవి ఇప్పటిదాకా మిస్ అవకుండా చూసేసాను. ఆయనతో నటించాలని నా కోరిక.
 హేమమాలిని చాలా బాగున్నారు. ఆమె ఇప్పటికీ తమిళం బాగా మాట్లాడుతున్నారు. ఆమె పుట్టిన ఊరు తమిళనాడులోని తిరుచ్చీ కదా….ఎప్పుడు కలిసినా మేమంతా తమిళంలోనే మాట్లాడుకుంటాం. తమిళంలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యుమర్ హిందీలో రాదు. అందుకే మేము తమిళంలో మాట్లాడుతాము.
ఇంగ్లీష్ విన్గ్లీష్ లో శ్రీదేవి నటించిన తీరు బలేగా ఉంది. అటువంటి పాత్ర చెయ్యాలని ఉంది. నా మీద ప్రొడ్యూసర్ కు, దర్శకుడికి నమ్మకం రావాలి. డబ్బులే ప్రధానం అనుకునే మనుషులు కాకుండా నమ్మకంతో అటువంటి సినిమా తీస్తే అందులో నటించాలని ఉంది. ఈ ఆశ ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదు.

Send a Comment

Your email address will not be published.