మళ్ళీ సెట్స్ పై చెర్రీ ...

రామ్ చరణ్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో కొత్త సినిమా శ్రీకారం చుట్టుకుంది.  మరో ప్రముఖ దర్శకుడు వీ వీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ముహూర్తపు కార్యక్రమంలో చరణ్ తల్లితండ్రులు సురేఖ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ఇదొక వినోదాత్మక చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కృతి ఖర్బంద రామ్ చరణ్ సోదరిగా నటిస్తోంది.

విడిపోయిన రచయితలు గోపీ మోహన్, కోన వెంకట్ ఈ చిత్రం కోసం శ్రీను వైట్లతో మళ్ళీ చేతులు కలిపారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా ఈ విధంగా రాసుకుంది ….”దానయ్య గారి ప్రొడక్షన్ లో శ్రీను వైట్ల దర్శకత్వంలో నా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కోన, గోపీ కలిసి చక్కటి మాటలు అందిస్తారు. థాంక్స్ డాడ్. అలాగే ముహూర్తం షాట్ కి వచ్చిన వినయ్ గారికి కూడా ధన్యవాదాలు”

Send a Comment

Your email address will not be published.