'మహానటి' కోసం నిరీక్షణ

Mahanati

తెలుగు, తమిళ సినీరంగాన్ని క్రీగంటి చూపులతో, అనితరసాధ్యమైన అభినయ విన్యాసాలతో కొన్ని దశాబ్దాలపాటు పాదాక్రాంతం చేసుకున్న మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా నిర్మించిన “మహానటి” సినిమా వచ్చేనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తిసురేష్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాదే సావిత్రి జయంతి సందర్బంగా ‘మహానటి’ టైటిల్ లోగోను విడుదల చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసేసింది చిత్రయూనిట్. టైటిల్ మాయాబజార్ సినిమాలోని ఓ బొమ్మల పెట్టెతో ప్రారంభమైన ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్లకు కనిపిస్తుంది అంటూ మొదలై మీకు పెళ్లయిందా..? అయితే నన్ను చేసుకుంటారా..?, నన్ను వదిలి నీవు పోలేవులే.. అది నిజములే’ అంటూ సావిత్రి సినిమాల్లోని డైలాగులు, పాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో అదరగొడుతున్న మ్యూజిక్ ప్లే అవుతుండగా ఓ మహిళ ఆ పెట్టెను తెరవగానే అందులోంచి ‘మహానటి’ టైటిల్ బయటకు రావడం అప్పట్లో అందర్నీ ఆకట్టుకుంది.

తొలిపాట: మైమరపించే మూగ మనసులు!
MahanatiSavitriకీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. ‘మూగ మనసులు..’’ అంటూ సాగే ఈ గీతం మనస్సును హత్తుకుంటోంది. శ్రేయాఘోషల్‌, అనురాగ్‌ కుల్‌కర్ణి ఆలాపించిన ఈ పాటను చూస్తున్నంత సేపు.. మీరు ఆనాటి లోకంలో విహరిస్తున్న అనుభూతి కలగడం ఖాయం. మిక్కీ జె.మేయర్‌ బాణీలు అందించిన ఈ గీతానికి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. అలనాటి పాటలను గుర్తుకుతెచ్చేలా ఇందులో సెట్టింగ్స్‌ తీర్చిదిద్దారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ‌, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

విడుదలకు ముందే
విడుద‌ల‌కు ముందే `మ‌హాన‌టి` సినిమా మంచి హైప్ సంపాదించుకుంది. తెలుగు వాళ్లు ఎంతో అభిమానించే మ‌హాన‌టి సావిత్రి జీవిత‌కథ కావ‌డం, చాలామంది సినీ ప్ర‌ముఖులు ఈ సినిమాలో న‌టిస్తుండ‌డం సినిమాపై అంచనాల‌ను పెంచుతోంది. విడుద‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ సినిమా టీజ‌ర్‌ను, ఫోటోల‌ను విడుద‌ల చేసింది. సావిత్రి గెట‌ప్‌లో ఉన్న హీరోయిన్ కీర్తి సురేశ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది.
తాజాగా దుల్క‌ర్ స‌ల్మాన్‌, కీర్తి సురేష్ ఫోటోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ ఫోటోపై సినీ న‌టుడు రానా త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా స్పందించాడు. `దుల్క‌ర్‌, కీర్తి.. మీరు అద్భుతంగా ఉన్నారు. నాగ్ అశ్విన్ నీకు శుభాకాంక్ష‌లు. అంతా బాగుంది. ఈ సినిమా కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్త‌న్నానం`టూ రానా ట్వీట్ చేశాడు. రానా ఒక్కడే కాదు…. సావిత్రి జీవితాన్ని ఈ సినిమాలో ఎలా ఆవిష్కరించారా? అని ఆసక్తితో చూడడానికి దక్షిణాది ప్రజలంతా నిరీక్షిస్తున్నారు

Send a Comment

Your email address will not be published.