మహానటి వారసుడొచ్చాడు

abhinayమహానటి సావిత్రి బయోపిక్ సినిమాగా వచ్చే నెల విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మలయాళ నటి కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్సకత్వం శ్రీ నాగ్ అశ్విన్ మరియు నిర్మాత శ్రీ అశ్వినీ దత్.

అయితే సావిత్రి మరణం తరువాత వారి కుటుంబం గురించి గానీ వారి వారసులు గురించి గానీ ఎక్కువ వివరాలు చాలా మందికి తెలియడం లేదు. శ్రీమతి సావిత్రి అంతిమ దశలో చాలా బాధలు పడ్డారని ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారని వార్తలు వినడమే కానీ ఆ తదుపరి ఎక్కువ సమాచారం తెలియరాలేదు.

ఈ మధ్య సావిత్రి కుమార్తె చాముండేశ్వరి చిన్న తనయుడు అభినయ్ కొన్ని తెలుగు/తమిళ సినిమాల్లో నటిస్తుండడం గమనార్హం. 2014 లో శ్రీ రామానుజన్ పై వచ్చిన సినిమాలో నటించాడు. తెలుగులో ఇప్పటికే “యంగ్ ఇండియా” లో కధానాయకుడుగా నటించాడు. ఇప్పుడు మరిన్ని తెలుగు/తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు కూడా.

అభినయ్ టేబుల్ టెన్నిస్ లో తమిళనాడు రాష్ట్రం తరఫున జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. తాతగారు శ్రీ జెమినీ గనేషన్ గారి పోలికలు ఆటల్లో తనకు వచ్చాయని అంటాడు. ఇద్దరు మహానటుల వారసుడైనా వారి పేరు ఎవరికీ చెప్పకుండా తన నటనను నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు అభినయ్ చెప్పాడు. అంచలంచెలుగా ఎదిగి సావిత్రి పేరు నిలబెట్టాలన్న దీక్షతో ఉన్నాడు.

లండన్ లో పై చదువులకోసం వెళ్లి సావిత్రి గారి నటన వైశిష్ట్యాన్ని అక్కడ తెలుసుకొని ఈ రంగంలోకి వచ్చినట్లు అయన చెప్పాడు. శ్రీ రజనీకాంత్ మరియు శ్రీ కమల్ హసన్ గార్ల ఆశీస్సులు అందుకొని ముందుకు సాగుతున్నట్లు అయన చెప్పాడు.

Send a Comment

Your email address will not be published.