‘మహానుభావుడు’

మారుతి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలోరూపొందిన చిత్రం మహానుభావుడు.
శర్వానంద్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నాజర్, కళ్యాణి నటరాజన్, ఆనంద్, జబర్దస్త్ వేణు తదితరులు నటించారు. ఈ చిరతానికి సంగీతం తమన్.

Mahanubhavuduవంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం కథలోకి వెళ్తే….
ఆనంద్ పాత్రలో నటించిన శర్వానంద్ ఓసీడీ అనే డిజార్టర్ తో బాధపడే కుర్రాడు. అంటే మరీ శుభ్రత ఎక్కువనేది బలహీనతగా మారిపోయే డిజార్డరు అది. అతని ఈ తత్వం అవతలి వాళ్లకు ఇబ్బందే. కానీ అతను మాత్రం ఈ డిజార్డర్ ని ఓ అర్హతగా తీసుకంటాడు. భావిస్తుంటాడు. అతను తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. సినిమాలో ఆ అమ్మాయి పేరు మేఘన. ఈ పాత్రలో మెహ్రీన్ కౌర్ నటించింది. ఆ అమ్మాయి అంటే అతనికి ఎంతో ప్రేమ. ఆమెకూ అతనంటే ఇష్టమే. ఆమె అతనిని ప్రేమించి తన తండ్రితో తమ ప్రేమ విషయం చెప్తుంది. వీరి పెళ్ళికి ఆమె తండ్రి ఒప్పుకుంటాడు. మొదట్లో అతని బలహీనతను మేఘన సాధారణంగానే తీసుకుంటుంది. కానీ పోను పోను ఆ డిజార్డర్ తీవ్రతను మేఘన అర్థం చేసుకుంటుంది. దాంతో ఆమె అతనిని అసహ్యించుకుంటుంది. దూరమైపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ స్థితిలో ఆమె ప్రేమను నిలుపుకోవడానికి ఆనంద్ ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
ఇది ఓ వినూత్న చిత్రం.
ఈ చిత్రంలో అతిశుభ్రత అనేదే ప్రధాన సమస్యగా చూపిస్తూ దాని మీదే కథంతా సాగుతుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా కథను నడిపిస్తూ వినోదం పంచడంలో దర్శకుడు మారుతి విజయుడయ్యాడు.
కథానాయకుడు, కథానాయికల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. చిత్ర సంగీతం కూడా చాలా బాగుంది. పాటలు వినడానికి హాయిగా అనిపిస్తుంది.

హీరోను పరిచయం చేసిన తీరు, అతని ప్రేమ, భావోద్వేగాలు, ఈ క్రమంలో తలెత్తిన సమస్యలు బాగా నడిపించారు. ప్రథమార్థం సాఫీగా హాయిగా సాగింది. అయితే ద్వితీయార్థంలో కాస్త లాగింగ్ కనిపిస్తుంది.
శర్వానంద్, కిషోర్ మధ్య సన్నివేశాలు బాగా పండాయి.
మామూలుగా అయితే వీటిని జీర్ణించుకోవడం కష్టం కానీ.. మారుతి
శర్వానంద్ తనో విలక్షణ నటుడని తన ప్రతిభతో నిరూపించాడు. కథానాయిక మెహ్రీన్ కౌర్ ఈ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు. వెన్నెల కిషోరే నటన గురించి వేరేగా చెప్పక్కర్లేదు. నాజర్ తండ్రి పాత్రలో బాగా నటించాడు.
మొత్తంమీద దర్శకుడు మారుతి మళ్ళీ ఫాంలోకి వచ్చాడనడానికి ఈ చిత్రం ఓ తార్కణం. సకుటుంబంగా చూడదగ్గ చిత్రమే మహానుభావుడు.

Send a Comment

Your email address will not be published.