మహేష్ తో రకుల్ షూటింగ్

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ఎక్కువ డిమాండ్ ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్.
ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి ఆగస్టు పదకొండో తారీఖున షూటింగులో పాల్గొనడానికి ముహూర్తం ఖాయమైంది. ఈ చిత్రానికి దర్శకుడు తమిళ పరిశ్రమకు చెందిన ఏ ఆర్ మురుగదాస్.

నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 29 వ తేదీన ప్రారంభభమవుతున్నా రకుల్ మాత్రం వచ్చే నెలలో పాల్గొంటుంది అని యూనిట్ సమాచారం.

పాకు ప్రస్తుతం అయిదు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో నాలుగు తెలుగు సినిమాలు కాగా మరొకటి తమిళ చిత్రం.

ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ తో కలిసి ధ్రువ చిత్ర షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్ర నిర్మాణం శరవేగంతో సాగుతోంది.

అనంతరం ఆమె బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించబోతోంది రకుల్.

అలాగే సాయి ధరమ్ తేజ్ తో కలిసి మరో చిత్రంలో నటించడానికి రకుల్ ఒప్పందం చేసుకున్నారు. తమిళంలో హీరో విక్రంతో నటించబోతోంది రకుల్.

ఇలాఉండగా సాయి ధరమ్ తేజ్ తో చేయాలనుకున్న చిత్రం నుంచి రకుల్ తప్పుకున్నట్టు ఓ వర్గం చెప్తుండగా ఆ వార్తలు ఒట్టి వదంతులే అని, ఆమె తప్పకుండా సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించబోతున్నారని రకుల్ మేనేజర్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.