మహేష్ బాబు ఆగడు

ప్రిన్సు మహేష్ బాబు, తమన్నా జంటగా నిర్మిస్తున్న తాజా చిత్రం  ఆగడు టైటిల్ సాంగ్ చిత్రీకరణ బళ్లారిలో సాగింది.

14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బానర్ పై రామ్ ఆచంట. గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం కోసం ఈమధ్యే హైదరాబాద్లోని రామోజీ  ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసారు.

మహేష్ బాబు ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం ఒక గొప్ప చిత్రమవుతుందని దర్శకుడు శ్రీను వైట్ల చెప్పారు.

ప్రతినాయకుడి పాత్రను ప్రకాష్ రాజ్ పోషించారు.

భారీస్థాయిలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి అవుతుందని, వేసవి కాలంలో దీనిని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రొడ్యూసర్ కోటి పరుచూరి తెలిపారు.

ఇలా ఉండగా ఈ చిత్రంలో నటిస్తున్న తమన్నాకు ఆశించని ఒక చక్కని అవకాశం లభించింది.

హాపీ డేస్ చిత్రంతో యువతరంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమన్నా మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నటిగా మాత్రం బాగానే ఎదిగింది. ఆమెకు అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు భాషల్లోనూ అగ్ర హీరోల సరసన ఇప్పటికే నటించింది. మహేష్ బాబుతో కలిసి ఆగడులో నటిస్తున్న తమన్నా ప్రభాస్ హీరోగా నిర్మితమవుతున్న బాహుబలి చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తోంది. ఈమెకు ఇప్పుడు ఒక కన్నడ చిత్రంలో నటించే అవకాశం కూడా దక్కింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన తమన్నా నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలిసింది. పవన్ వడాయర్ దర్శకత్వంలో నటించనున్న తమన్నాకు భారీ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించినట్టు తెలిసింది. అందుకే చేతికొచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఆగడు, బాహుబలి చిత్రాలకు కాల్ షీట్లు విషయంలో ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంది కూడా. తమిళంలో తమిళ హీరో ఆర్య తో నటించాలని ఉందని తమన్నా తెలిపింది. ఆ దిశలో ఆమె తగిన ప్రయత్నాలు కూడా చేపట్టింది.

Send a Comment

Your email address will not be published.