మహేష్ బాబు పుత్రోత్సాహం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆనందానికి అవధుల్లేవు. “1: నేనొక్కడినే” అనే చిత్రంలో ఓ పాత్రకు ఆయన ఏడేళ్ళ కుమారుడు గౌతం కృష్ణ డబ్బింగ్ చెప్పడం ఆయనకు ఎంతో ఆనందం కలిగించింది. పైగా ఆ పిల్లవాడు మరో టేక్  లేకుండా మొదటిసారే విజయవంతంగా డబ్బింగ్ పూర్తి చేయడం ఆయనను విస్మయపరచింది. ఈ “1: నేనొక్కడినే” చోత్రంలో మహేష్ బాబు హీరో. అందులో తాను చిన్న పిల్లవాడిగా ఉన్న పాత్రను గౌతం కృష్ణ పోషించాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. తాను పలకవలసిన వాక్యాలను చదివీ చదవగానే గౌతం వాటిని చక్కని హావభావ చేష్టలతో వల్లించాడని దర్శకుడు బి. సుకుమార్ చెప్పారు. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలలో గౌతం నటించాడు. చిన్నప్పుడు  తనను తన తండ్రి  చిత్ర రంగానికి పరిచయం చేసిన దృశ్యం మనసులో మెదిలి కళ్ళు చేమ్మగిల్లాయని మహేష్ కూడా అన్నారు. ఈ చిత్రంలో ఇంకా కృతి షానన్, నాజర్, సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీలు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

Send a Comment

Your email address will not be published.