మహేష్ బాబు - బ్రహ్మోత్సవం

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్ర బ్రహ్మోత్సవం ఈ నెలాఖరులో ప్ర్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు అద్దాల శ్రీకాంత్. మహేష్ బాబు ఇప్పటికే నటించి అన్ని పనులు పూర్తి చేసుకున్న శ్రీమంతుడు సినిమా వచ్చే నెలలో విడుదల కానున్నది. నిజానికి ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కావలసింది. కానీ విడుదల వచ్చే నెలకు వాయిదాపడింది. శ్రీమంతుడులో శృతి హాసన్ మహేష్ బాబు సరసన నటించింది. ఈ చిత్రానికి కోరట్ల శివ దర్శకులు.

బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు జోడీగా సమంతా నటిస్తోంది. కాజల్, ప్రనిత తదితరులు కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు.

బ్రహ్మోత్సవం కథ ఎంతగానో నచ్చడం వల్ల కనుక త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంబించడానికి మహేష్ బాబు ఆసక్తి కనబరుస్తున్నారు.

బ్రహ్మోత్సవం చిత్రీకరణ తొలుత హైదరాబాదులో ప్రారంభమై ఆ తర్వాత విజయవాడ సమీపంలో లొకేషన్ మారవచ్చని యూనిట్ సభ్యుల మాట.

Send a Comment

Your email address will not be published.