మామ అడుగుజాడలో అల్లుడు

“మోసగాళ్ళకు మోసగాడు” సినిమా టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ పిక్చర్ అని అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో హీరో గా నటించి కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్న సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఇదొక గొప్ప  చిత్రం. సూపర్ హిట్ కొట్టిన చిత్రం. ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో అల్లుడు సుదీర్ బాబు నడుస్తున్నాడు.

మామయ్య సూపర్ హిట్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు టైటిల్ నే ఇప్పుడు సుదీర్ చిత్రానికి టైటిల్ అయింది. ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన  స్వామి రా రా చిత్రానికి సేక్వేల్ గా ఇప్పుడు బోస్ ఈ కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

చిత్ర యూనిట్ మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాతలు చడీ చప్పుడు లేకుండా ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసారనిమ ప్రమోషన్ విషయమై బిజీగా ఉన్నారని తెలిపింది.

ఈ చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి. ఆయనే స్వామి రా రా కూడా తీసారు.

ఈ చిత్రానికి టైటిల్ పెట్టడానికి ఎన్నో మాటలు జరిగినా చివరికి “మోసగాళ్ళకు మోసగాడు” అనే టైటిల్ నే ఖాయం చేసారు.

Send a Comment

Your email address will not be published.