మార్కెట్ పెరిగింది!

మలయాళం నటి అనుపమా పరమేశ్వరన్ కు మంచి డిమాండ్ వచ్చింది. అ, ఆ చిత్రం విజయంతో ఆమె పంట పండింది.

టాలీవుడ్ లో అ, ఆ ……..చిత్రంతో రంగప్రవేశం చేసిన అనుపమ ఇప్పుడు మాలీవుడ్ లో దల్ క్యూర్ సల్మాన్ ప్రాజెక్టులో ఓ మంచి పాత్రలో నటించడానికి ఒప్పందం కుదిరింది. ఆమె సల్మాన్ సరసన ప్రముఖ దర్శకుడు సత్యం అంతిక్కాడ్ దర్శకత్వంలో నటించబోతోంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకాబోతోంది.

ఆమె మలయాళంలో నటించిన మొదటి చిత్రం ప్రేమమ్. ఈ చిత్రమే తెలుగులో పునర్ నిర్మిస్తున్నారు. తెలుగులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ తో కలిసి నటించిన అనుపమ ఇప్పుడు బిజీ స్టార్ అయ్యింది. అయినప్పటికీ ఆమె స్క్రిప్ట్ ఎంచుకోవడంలో మాత్రం తగు జాగర్తలు తీసుకుంటున్నారట.
ఈ మధ్యే ఆమె ఓ తమిళ చిత్రం కూడా పూర్తి చేశారు. ఆ చిత్రంలో కథానాయకుడు ధనుష్.

సతీష్ విగ్నేష్ దర్శకత్వంలో వస్తున్న శతమానం భవతి చిత్రంలో ఆమె శర్వానంద్ తో కలిసి నటిస్తున్నారు. ఇలా మూడు భారీ చిత్రాలతో అనుపమ బిజీ కావడం ఆమె అభిమానులకు శుభవార్త అయ్యింది.

Send a Comment

Your email address will not be published.