మిస్టర్ చిత్రం ఆగిందా...?

శేఖర్ కమ్ముల చిత్రంలో వరుణ్…

దర్శకుడు శ్రీని వైట్లా, నటుడు వరుణ్ తేజ్ కలిసి గత ఏప్రిల్ 29వ తేదీన ఒక చిత్రాన్ని మొదలుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు దాని గురించి ఒక్క మాటామంతీ లేదు. ఆ ప్రాజెక్ట్ దాదాపుగా ఆగిపోయినట్టే అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి లావణ్య త్రిపాఠి, హెబ్బాహ్ పటేల్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్టు వరుణ్ తేజ్ జూన్ 27 వ తేదీన ప్రొడెక్షన్ వర్క్ మొదలవుతుందని ట్వీట్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఉలుకూ లేదు. పలుకూ లేదు.

మరోవైపు సెలవులో ఉన్న వరుణ్ తేజ్ ఇప్పుడు శేఖర్ కమ్ముల చిత్రంలోనటించడానికి ఒప్పంద పత్రాలపై సంతకం చేసినట్టు, శేఖర్ కమ్ముల నిర్వహిస్తున్న వర్క్ షాప్ తో వరుణ్ బిజీగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

వర్క్ షాప్ ముగిసిన తర్వాత షూటింగ్ మొదలవుతుంది అని విశ్వసనీయ సమాచారం.

మరోవైపు, వరుణ్ శ్రీను వైట్ల ప్రాజెక్టు మీద మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు శేఖర్ కమ్ముల చిత్రం షూటింగ్ లో పాల్గొనడానికి ఎంతో ఉత్సుకత చూపుతున్నట్టు తెలిసింది కూడా.

ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజ్. ఈ చిత్రంలో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించబోతోంది

Send a Comment

Your email address will not be published.