మిస్సమ్మకు అరవై ఏళ్ళు

మిస్సమ్మ చిత్రానికి అరవై ఏళ్ళు. అవును అచ్చంగా అరవై ఏళ్ళు.

1955 లో వచ్చిన ఈ చిత్రం నిరుద్యోగం సమస్యను కేంద్రబిందువుగా చేసుకుని సంధించిన వ్యంగ్య అస్త్రమే మిస్సమ్మ చిత్రం. ఇదో గొప్ప హాస్య చిత్రం.

దాదాపు మూడు గంటలు సాగిన ఈ కథా చిత్రంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి. ఎస్వీ రంగారావు, జమున, రేలంగి,  అల్లు రామలింగయ్య, రమణారెడ్డి తదితరులు నటించారు.

సాలూరి రాజేశ్వరరావు సంగీతం స్వరపరిచారు. ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల పాటలు పాడారు.      పింగళి నాగేంద్రరావు పాటలు రాసారు.

“మన్మొయీ గర్ల్స్ స్కూల్” అనే బెంగాలీ కథ ఆధారంగా పింగళి నాగేంద్రరావు తెలుగులో రాసిన దానినే మిస్సమ్మగా తెలుగులో తీసారు. ఈ చిత్రానికి ఎల్వీ ప్రసాదు దర్శకత్వం వహించారు.

తమిళంలోనూ ఈ చిత్రం తీసారు. తెలుగు మిస్సమ్మలో ఎన్టీఆర్ పోషించిన పాత్రను తమిళంలో గేమినీ గణేష్, అక్కినేని పాత్రను తంగవేలు పోషించారు. తమిళంలోనూ సాలూరి రాజేశ్వర రావు సంగీతం సమకూర్చారు.

పింగళి, సాలూరు, చక్రపాణి కలిసి రూపొందించిన మిస్సమ్మలో ఒక జమిందారు కుమార్తె ఓ పుష్క రాలప్పుడు తప్పిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయీని  క్రైస్తవ దంపతులు చేర దీసి చూసుకుంటారు. ఆమెకు మేరీ అని పేరు పెడతారు. మరోవైపు తప్పియిన తన కూతురు పేరిట జమిందారు ఒక స్కూలు నడుపుతారు. ఆ స్కూలు మాజీ ప్రధానోపాధ్యాయుడు, డిటెక్టివ్ అక్కినేని ఆ స్కూలు పనితీరుని పర్యవేక్షించడమే కాక తప్పిపోయిన జమిందారు కూతురి ఆచూకీ కోసం ప్రయత్నిస్తారు. ఇంకోవైపు బీ ఏ చదివి ఉద్యోగం దొరకక తిరుగుతున్న రావుతో ఒక ప్రకటన వల్ల మేరీ సహజీవనం చేయవలసి వస్తుంది. వీరిద్దరూ భార్యాభర్తల్లా జమిందారు దగ్గరకు వస్తారు. మేరీకి ఇష్టం లేకపోయినా రావుకి భార్యగా నటిస్తుంది. సేవలు చేయవలసి వస్తుంది. ఇలా కథ సాగి చివరికి సుఖాంతమవుతుంది మిస్సమ్మ చిత్ర కథ.

డిటెక్టివ్ గా అక్కినేని నటన అమోఘం.

తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత హిందీలోను వచ్చింది. హిందీలో కిషోర్ కుమార్ నటించారు.

మిస్సమ్మ చిత్రంలో తొలుత భానుమతితో ఈ సినిమా తీయాలనుకున్నారు చక్రపాణి. కొంత మేరకు చిత్రీజరణ కూడా జరిగింది. అయితే ఒకరోజు భానుమతి ఒక వ్రతం కారణంగా షూటింగుకి ఆలస్యంగా రావడంతో చక్రపాణి భానుమతిని తప్పించి ఆమె స్థానంలో సావిత్రిని ఎన్నుకుని  మిస్సమ్మగా సినిమా పూర్తి చేసారు.

టాలీవుడ్ చరిత్రలో మిస్సమ్మ చిత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రమే.

– కళ్యాణీ రెడ్డి

Send a Comment

Your email address will not be published.