
అన్నట్టు హీరోయిన్ తాప్సీ దక్షిణాదిలో నుంచి ముంబైకి మకాం మార్చింది. ఇక్కడ ఆమె మూటాముల్లె సర్దుకున్నట్టే అని అందరూ అనుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు తగ్గి తమిళంలో కాస్తంత బిజీగా ఉండిన తాప్సీ చేతిలో ఉన్న ముని 3 తో పాటు మరో సినిమా పూర్తి కావడంతో ఇక ఇక్కడ ఉండి లాభం లేదనుకుని ఆమె ముంబై వెళ్ళినట్లు చెప్పుకుంటున్నారు. హిందీలో చస్మే బద్దూర్ అనే సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ పెంచుకున్న తాప్సీ ప్రస్తుతం షాది.కామ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆమె వీలున్నంత ఎక్కువ సేపు గడుపుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందడానికి తెగ తాపత్రయపడుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. అంతే కాదు,. ఇక నుంచి ముంబై కేంద్రంగా మంచి ప్రాజెక్టులు అందిపుచ్చుకుని అక్కడే స్థిర పడాలని భావిస్తోంది. మంచి కథలోస్తే అటు తెలుగులోనూ, ఇటు తమిలంలోము నటించడానికి తాను సిద్ధమని తాప్సీ వెల్లడించింది.
హైదరాబాద్ తనకు ఎంతో ఇష్టమైన ఊరు అయినప్పటికీ స్వస్థలం ముంబై కావడంతో అక్కడే ఉండాలనుకుంటోంది.
ఆమె ఝుమ్మంది నుంచి మొన్న మొన్నటి సాహసం వరకు చిత్రాలలో నటించినా ఏదీ సరిగా కలిసిరాలేదు.