ముకుందతో వరుణ్ తేజ్

నాగాబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ముకుంద సినిమా విడుదల అయ్యింది.
కథ, స్క్రీన్ ప్లేతోపాటు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల సారధ్యంలో రూపుదిద్దుకున్న ముకుంద చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది.

గ్రామీణ రాజకీయాల నేపధ్యంలో సాగిన యాక్షన్ చిత్రం ముకుంద.
ముఖ్యంగా యువతరాన్ని ఫోకస్ చేస్తూ వరుణ్ తేజ్ తో రొటీన్ కి భిన్నమైన రీతిలో నటింప చేసిన దర్శకుడి ప్రయత్నం నాట్ బ్యాడ్.

ఒక ఊరి చైర్మన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని ముకుంద మిత్రుడు ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమను చైర్మన్ అడ్డుకోవాలనుకుంటాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తులు వేసే ఎత్తులకు ముకుంద పాత్రలో నటించిన వరుణ్ తేజ్ అడ్డం పడటమే ఈ చిత్ర కథనం.

వరుణ్ తేజ్ గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. దర్శకుడు అతని ప్రతిభకు మరింతగా మెరుగు పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అతని జంటగా నటించిన పూజ హెగ్డే అందంగా కనిపిస్తుంది. ఊరి చైర్మన్ పాత్రలో రావు రమేష్ నటన చాలా బాగుంది. ప్రకాష్ రాజ్, నాజర్, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

టాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాతలు.

మొత్తం మీద సినిమా యావరేజ్.

Send a Comment

Your email address will not be published.