ముగిసిన బన్నీ వంతు

గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చారిత్రక రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర పూర్తయ్యింది. ఈ చిత్రంలో బన్నీ(అల్లు అర్జున్) గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు. చిత్ర యూనిట్  వివరాల మేరకు బన్నీ షూటింగ్ పార్ట్ ముగిసినట్లు తెలిసింది.

జూలై మొదటి వారం నుంచి ఆయనకు కేటాయించిన డేట్స్ ఊపిరి తీసుకోవడానికి వీల్లేకుండా ఉన్నాయి. కొన్ని రోజులు షూటింగ్ భారీస్థాయిలో సాగింది. ఆయనతోపాటు మరికొందరు కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో బన్నీ జంటగా కాథరీన్ ట్రెసా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. ఆమెకు జతగా రానా  నటిస్తున్నారు.

రుద్రమదేవిలో తన వంతు షూటింగ్ పూర్తి చేసుకున్న బన్నీ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు.  ఆ ప్రాజెక్టుని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబితున్నారు. నిజానికి ఈ కొత్త ప్రాజెక్ట్ నెల క్రితమే ప్రారంభం కావలసింది. అయితే రుద్రమదేవి షూటింగ్ పనుల వల్ల అది ఇప్పుడు మొదలు కాబోతోంది.

Send a Comment

Your email address will not be published.