మూడో భాగం కూడా ఉంది...

కోట్ల ఖర్చుతో కనీ వినీ ఎరగని రీతిలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మొదటి భాగం ఇప్పటికే ప్రేక్షకలోకంలో విజయవంతమైంది. ఇక రెండో పార్ట్ ఉందని అప్పుడే చెప్పిన రాజమౌళి ఇప్పుడు మూడో భాగం కూడా ఉందని వెల్లడించారు.

బాహుబలి మొదటి భాగం జస్ట్ ఆరంభమే అని చెప్తూ ఆ కథను మరింత పెంచి రెండో భాగంలో నడిపి స్తానన్నారు. అది అందరికీ తెలిసిందే.

బాలీవుడ్ నిర్మాతలనుంచి బాహుబలి కథను విస్తరించడం కోసం వస్తున్న ఒత్తిళ్ళు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో మూడో పార్ట్ కూడా తప్పదనిపిస్తోంది. మూడో భాగం మీద ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయని, బాహుబలి కథ రెండో పార్టుతో ముగిసిపోతుందని, ఇక సాగదీయడం ఉండదని అయితే బాహుబలి అంతకుముందు చవిచూడని రీతిలో మూడో భాగానికి విస్తరించడం జరుగుతుందని రాజమౌళి సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు. టైం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానన్నారు. కనుక రూమర్స్ నమ్మకండి అని ఆయన స్పష్టం చేసారు. ఆ వివరాలు తనకు మాత్రమే తెలుసనీ చెప్పారు.

ఇంతలో అదే పనిగా వస్తున్న రూమర్స్ తో ఆయన మరుసటిరోజే స్పష్టం చేయడం పక్కన పెట్టి మరింత సమాచారంతో అభిమానులను అయోమయంలోకి నెట్టారు. బాహుబలి మూడో భాగం ఉంది కానీ కథనం మాత్రం మొదటి రెండింటికీ భిన్నమని చెప్పారు. క్లారిటీ ఇవ్వకుండా అయోమయంలోకి నేట్టేసినందుకు మన్నించండి అని చెప్తూ బాహుబలి – 3 తీసే ఆలోచన అయితే ఉందని అన్నారు.

అయితే కథ ఇప్పటి వరకు మొదటి రెండు భాగాలకే రాయడం జరిగినట్టు, దానిని మూడో భాగానికి సాగదీయడం కుదరదని, అయితే మూడో భాగం కథ , కథనం ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని విధంగా, ఊహించని విధంగా ఉంటుందని మాత్రం చెప్పగలనని ఆయన స్పష్టం ఇచ్చారు.

Send a Comment

Your email address will not be published.