ప్రముఖ తెలుగు నటి రంభ మీద వరకట్న వేధింపుల కేసు నమోదయింది. రంభ సోదరుడు శ్రీనివాస రావు భార్య పల్లవి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో బంజారా హిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీనివాసుకు, పల్లవికి 1999లొ వివాహం అయింది. పెళ్లి సమయంలో తగినన్ని కట్న కానుకలు, లాంచనాలు ఇచ్చారు. తమ కాపురం కొంత కాలం సజావుగా సాగిందని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని, ఆ తరువాత నుంచి తనకు భర్త నుంచి, ఆడపడుచు రంభ నుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయని పల్లవి తన ఫిర్యాదులో పేర్కొంది.
రంభ తనను తరచూ తిడుతూ, కొడుతూ, కట్నం తీసుకు రాకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని వేధించడం పరిపాటి అయిందని ఆమె తెలిపింది. బంజారా హిల్స్ పోలీసులు రంభ పైనా, శ్రీనివాసు పైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.