మేజిక్ లేని జాదూగాడు

నాగ శౌర్య, సొనారికా జంటగా నటించిన చిత్రం జాదూగాడు.

యోగేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పల్లె యువకుడైన నాగాశుర్య కోటీశ్వరుడు అవాలనుకుంటాడు. అదే ఆశయంతో హైదరాబాద్ వస్తాడు. అక్కడ కొందరు మిత్రులతో ఉంటాడు. అతను ఒక బ్యాంక్ కు లోన్ రికవరీ ఏజెంటుగా ఉంటాడు. ఈ క్రమంలో అతను తన కలలను నిజం చేసుకోవడానికి కృషి చేస్తాడు. మరోవైపు అతనికి స్థానిక మాఫియా డాన్ తో పరిచయం ఏర్పడుతుంది. సినిమాలో ఆ పాత్ర పేరు శ్రీశైలం. సినిమాలో జాకీర్ హుసేన్.

ఇంతసలో ఈ కథానాయకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి పేరు సొనారికా. తన కల నెరవేరిన తర్వాత ఆమెతో కలిసి దుబాయిలో స్థిరపడాలనుకుంటాడు.

కథ ఇలా సాగుతుంటే శ్రీశైలం ఆలోచనలు వేరేగా ఉంటాయి. వెయ్యి కోట్ల రూపాయల స్కాంలో కథానాయకుడిని ఇరికించాలనుకుంటాడు. కథానాయకుడికి ఈ విషయం తెలియకుండా చేయాలనుకుంటాడు మాఫిఆ దాన.

ఇంకోవైపు అవినీతి పోలీస్ అధికారి కూడా డబ్బుల కోసం నీతి గట్రా మరచిపోతాడు.

ఈ సినిమా కథాంశం డబ్బులు కోసం ఒక్కొక్కరూ ఎలా అర్రులు చాస్తారన్నదే అలాగే కథానాయకుడి కల ఎలా నెరవేరింది అనేది వెండితెరపై చూడాలి.

కథానాయకుడు నాగశౌర్య తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. అతను చేసిన డ్యాన్స్ కూడా ఈ చిత్రంలో బాగుంది. సొనారికా ఈ చిత్రంతో తన కెరీర్ కి శ్రీకారం చుట్టింది. కోట శ్రీనివాస రావు రాజకీయనాయకుడిగా చాలా ఈజీగా తన పాత్రను పోషించారు.

మణిశర్మ కుమారుడు సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సంగీతం ఓకే. సాగర్ మహతి కి ఇదే మొదటి చిత్రం.

కొన్ని మలుపులతో ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందించవలసిందే. కానీ అనుకున్నంత వినోదాన్ని కలిగించలేదు.

ఈ చిత్రంలో తాగుబోతు రమేష్ పాత్ర సుద్ద దండగ. కాల్ గర్ల్ ఎపిసోడ్ కూడా బ్యార్ధమే.

Send a Comment

Your email address will not be published.