మోహినిగా మనోజ్

నాడు పాండవులు పాండవులు తుమ్మెద పాట ఎంతగా హిట్ అయ్యిందో ఇప్పుడు అదే టైటిల్ గా తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. డైలాగ్ లు చెప్పడం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న మంచు మోహన్ బాబు తన ఇద్దరు కుమారులు విష్ణు. మనోజ్ లతో కలిసి నటించారు. మోహన్ బాబు అన్ని విధాల అందించిన సహకారంతో 85 రోజుల్లోనే పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ మల్టీ స్టారర్ సినిమాలో మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న పాత్ర కూడా ఉండాల్సింది. ఆమెతో ఒక పాట రికార్డు చేసినా  అనుకోని కారణాలవల్ల పెట్ట లేకపోయామని  శ్రీనివాస్ చెప్పుకొచ్ఛారు.

ఈ సినిమాలో మోహిని పాత్రలో నటించిన మనోజ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నారు. నిజానికి ఎందరో హీరోలు ఆడ వేషంలో నటించినా మనోజ్ మోహిని గెటప్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మేకప్ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇక మోహన్ బాబు ఈ తరానికి అవసరమైన రీతిలో డైలాగులు చెప్పి మెప్పించారు. తనీష్, వరుణ్ సందేశ్, హన్సిక, రవీన టాండన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచయితలు కోన వెంకట్, బీ వీ ఎస్ రవి, గోపీ మోహన్ కథను రకరకాల మలుపులు తిప్పిన కారణంగానే ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమా అయ్యిందని దర్శకుడు శ్రీనివాస్ వివరించారు.

Send a Comment

Your email address will not be published.