బిచ్చగాడు చిత్రంతో ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన నటుడు విజయ్ ఆంటోనీ మరో చిత్రమే “యమన్” .
జీవా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీతో పాటు ఆరుళ్, త్యాగరాజన్, కథానాయిక మియా జార్జ్, చార్లీ, జ్యోతి తదితరులు నటించారు.
సంగీతం కూడా విజయ్ ఆంటోనీయే అందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా జీవాశంకర్ సమకూర్చారు.
అశోక్ చక్రవర్తి పాత్రలో నటించిన విజయ్ విజయ్ ఆంటోనీకి చిన్నతనంలోనే కన్న తల్లిదండ్రులను కోల్పోతాడు. అతనిని తాతే పెంచి పెద్ద చేస్తాడు. అయితే తను చేయని ఒక ప్రమాదాన్ని తనపై వేసుకుని జైలుపాలైన విజయ్ ఆంటోనీ శిక్ష ముగించుకుని విడుదల అయిన తర్వాత అతని జీవితం మారిపోతుంది. చెప్పుకోవడానికి మంచి ఉపాధి ఉన్నా ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య విభేదాలతో విజయ్ ఆంటోనీ ఇరకాటంలో పడతాడు. అయినా తాను సమస్యలను అధిగమించడానికి రాజకీయాలే సరైన మార్గం అనుకుని అందుకు ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏమిటీ? ఎలా అనుసరించాడు? ఎలా అనుకున్నది సాధించాడు వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వెండితెరపై “యమన్” చిత్రం చూడాలి.
విజయ్ ఆంటోనీ నటనే కాదు అతనితో నటించిన మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్రలకు అన్ని విధాలా న్యాయం చేసారు అనడంలో సందేహం లేదు. తాను ఓ సాదాసీదా నటుడినే అంటూ గొప్పగా నటించిన విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి స్వరాలూ కూడా చక్కగా అందించారు. దర్శకుడే ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ కూడా సమకూర్చడం విశేషం. కథకు తగిన సన్నివేశాలను కొన్ని చోట్ల కపట్టుగా సాగించాడు.
కానీ కథనాన్ని నడిపించిన తీరులో ఇంకాస్త జాగర్తలు తీసుకుని ఉంటే బాగుండేది. అందుకే విషయం ఉన్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో అక్కరలేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. దానితో దెబ్బతింది. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంది చిత్రంలా మారిపోయింది.