యామీ గౌతం ఆనందం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ త్వరలో ఒక ఆల్బం తీసుకురాబోతున్నారు. ఆ ఆ ఆల్బం పేరు రానక్. కొంత కాలంగా సినిమాలపై దృష్టి కేంద్రీకరించడంతో ప్రత్యేకంగా ఆల్బంల  సంగతి పక్కన   పెట్టిన రెహ్మాన్ ఇప్పుడు ఎలాగైనా ఒక ఆల్బం తీసుకురావాలనుకున్నారు. ఇది ఒక వీడియో ఆల్బం. ఇందులో నటించే అవకాశం యామీ గౌతంకు వచ్చింది. దానితో ఆమె ఆనందానికి అంతులేదు. మొదట బాలీవుడ్ లో పరిచయమైన యామీ గౌతం ఆ తర్వాత నువ్విలా అనే తెలుగు చిత్రంలో నటించింది. ఆ చిత్రం మంచి విజయాన్నే అందించింది. అయితే తదుపరి నటించిన ఆమె చిత్రం గౌరవం పెద్దగా హిట్ కొట్ట లేదు. అయినా  ఆమెకు యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాన్ అనే చిత్రాల్లో నటించే అవకాశం  వచ్చింది. వీటిలో యుద్ధం పూర్తవగా మరో సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు రెహ్మాన్ ఆల్బంలోను చాన్సు రావడంతో ఆమె బిజీ బిజీ అయ్యిందనే చెప్పుకోవచ్చు.

Send a Comment

Your email address will not be published.