యు ట్యూబ్ లో డిక్టేటర్

నటుడు బాలకృష్ణ నటించి ఇటీవల విడుదలైన డిక్టేటర్ చిత్రం యూ ట్యూబ్ లో దర్శనమిచ్చింది.

పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డిక్టేటర్ ఫైల్ స్థానిక టీవీ నెట్ వర్క్ ఖాతాకు కనెక్ట్ అయి ఉండటం…..

అయితే ఆ స్థానిక టీవీ నెట్ వర్క్ వర్గాల మాత్రం తమకు ఆ సంగతి తెలియదని , ఈ పైరసీ కాపీ ఎలా తమ నెట్ వర్క్ కి కనెక్ట్ అయ్యిందో తెలీదని స్పష్టం చేసింది.

డిక్టేటర్ చిత్ర నిర్మాతలు మాత్రం మండిపోతున్నట్టు తెలియవచ్చింది.
సంబంధిత నెట్ వర్క్ కి ఫోన్ చేసి దిమ్ము దులిపినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ వీడియో ని తొలగించడం జరిగింది. యావత్తు టాలీవుడ్ పైరసీ మీద పోరాటం చేస్తున్న సమయంలో ఇలాంటి విషయం జరగడం అందరినీ దిగ్భ్రమకు లోను చేసింది.

డిక్టేటర్ చిత్రం జనవరి 14వ తేదీన విడుదల అయిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టింది కూడా.

అయితే ఇంతకూ ఈ చిత్రం కాపీనీ ఎవరు ఎలా అప్ లోడ్ చేశారన్నది మిస్టరీగా మారింది.

సంబంధిత టీ వీ చానల్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్టు తెలిసింది. మరో వార్త ఏమిటంటే సంబంధిత చానల్ లోని ఒక వ్యక్తి దానిని అప్ లోడ్ చేసినట్టు అనుమానిస్తున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే చానల్ ఈ చిత్రం తాలూకు ప్రసార హక్కులను కొనుగోలు చేయడం.

ఈ చిత్రం దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తానూ ఈ వ్యవహారం తెలిసి విస్తుపోయానని అన్నారు. దీనిపై తన సెల్ ఫోన్ కి బోలెడు ఎస్ ఎం ఎస్ లు వచ్చాయని, వెంటనే తాను కొందరితో చర్చించానని అన్నారు. దీనితో వెంటనే ఆ ప్రింట్ తొలగించినట్టు సంబందితులు తెలియజేశారని ఆయన అన్నారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన ఏరాస్ సంస్థతో తాను మాట్లాడానని, ఈ వ్యవహారంలో గట్టి చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఈ వ్యవరానికి సంబంధించి ఆ నెట్ వర్క్ ఇప్పటికే పాసిటివ్ గా స్పందించి ఇంటర్నల్ దర్యాప్తు చేపట్టిందని శ్రీనివాస్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.