రఘువరన్ బీ.టెక్

స్రవంతి రవికిషోర్ నిర్మాతగా వేల్రాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రఘువరన్ బీ టెక్. అనిరుధ్ స్వరపరచిన ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ సుందరి  అమలా పాల్ జంటగా నటించిన ఈ చిత్రం చూడదగ్గదే.

తమిళంలో  ‘వేలైఇళ్ళ పట్టదారి’ అనే పేరుతో  ఈ సినిమా గత ఏడాది విడుదల అయి సూపర్ డూపర్ హిట్టయ్యింది. దానినే ఇప్పుడు ఈ ఏడాది మొదటి రోజున రఘువరన్ బీ.టెక్ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

రఘువరన్ పాత్రలో నటించిన ధనుష్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. నాలుగేళ్ళు ఉద్యోగం గట్రా లేకుండా ఇంటిపట్టునే ఉంటాడు. ఎన్నో ఉద్యోగాలకు అవకాశం వస్తుంది కానీ వెళ్ళడు. చేస్తే సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం చెయ్యాలనుకుంటాడు. అందుకే మిగతా అవకాశాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళడు. ఈ క్రమంలో అతను ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వస్తుంది. రోజులు ఇలా గడుస్తుండగా పొరుగు ఇంట్లోకి  వచ్చిన  శాలిని(చిత్రంలో అమలా పాల్ క్యారక్టర్ పేరు)తో ధనుష్ కి పరిచయమవుతుంది. ఆ అమ్మాయితో ధనుష్ ప్రేమలో పడతాడు. ఇంతలో ధనుష్ తల్లి చనిపోతుంది.  ఈ దుర్ఘటన అనంతరం ధనుష్ కి అనిత పాత్రలో నటించిన సురభి వల్ల రఘువరన్ కి సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది. అయితే ఆ ఉద్యోగంలో రఘువరన్ పాత్రలో నటించిన ధనుష్ కి ఎదురైనా సమస్యలు, అనిత ఎందుకు  ధనుష్ కి ఉద్యోగం ఇప్పిస్తుంది వంటి కథలోని ఎన్నో  మలుపులను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడవలసిందే.

ధనుష్ నటన ఎంతో సహజంగా ఉంది. దర్శకుడు అతని పాత్రను చక్కగా మలిచాడు.

అనిరుధ్ సంగీతం బాగుంది.

అమలా పాల్ ఎంతో బాగుంది. ప్రేమ సన్నివేశాలలో అమలాపాల్ నటన అందరినీ ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడం ఖాయం.

అయితే ఒక విషయం చెప్పుకోవాలి… ఫస్ట్ హాఫ్ వినోదాత్మకంగా ఉన్నా సెకండ్ హాఫ్  కొంత నెమ్మదిగా సాగిందా అనిపిస్తుంది.

సినిమాటోగ్రఫీ, దర్శకత్వ విభాగాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.

ఏదేమైనా అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే సినిమా  రఘువరన్ బిటెక్. చూసినంత సేపూ విసుగు పుట్టాడు.

Send a Comment

Your email address will not be published.